కాజల్.. పెళ్ళికి యెస్ చెప్పింది..

లాక్డౌన్ మొదలయినప్పటి నుండి తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ అందరూ పెళ్ళి పీటలెక్కుతున్నారు. నిఖిల్, నితిన్, రానా.. ఇలా ఒక్కొక్కరుగా తమ జీవిత భాగస్వామితో ఓ ఇంటివారయ్యారు. ఐతే గత కొన్ని రోజులుగా హీరోయిన్ కాజల్ పెళ్ళి విషయమై చాలా వార్తలు వచ్చాయి. బిజినెస్ మేన్ ని పెళ్ళి చేసుకోబోతుందంటూ పుకార్లు పుట్టాయి.
ఐతే ఇప్పుడవన్నీ నిజమయ్యాయి. ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టిన కాజల్, గౌతమ్ కిచ్లు తో నా వివాహం అక్టోబర్ 30వ తేదీన జరగబోతుందని, ఈ వార్తని మీకు తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలో వివాహ వేడుక జరగనుందని తెలిపింది. ఇప్పటి వరకూ నా యాణంలో భాగమైన మీరందరూ నా కొత్త జీవితానికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నానని, పెళ్ళి తర్వాత కూడా నటిస్తానని చెప్పుకొచ్చింది.
Kajal said yes to marriage..
Kajal said yes to marriage..







































