నిశ్శబ్దం డేట్ కూడా వచ్చేసింది..?

NIssabdam OTT release date fix..?

Tue 15th Sep 2020 10:50 PM
nissabdam,anushka shetty,r madhavan,anjali,shalini pandey  నిశ్శబ్దం డేట్ కూడా వచ్చేసింది..?
NIssabdam OTT release date fix..? నిశ్శబ్దం డేట్ కూడా వచ్చేసింది..?
Advertisement

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలొ తెరకెక్కిన నిశ్శబ్దం చిత్రం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా థియేటర్లు మూసి ఉన్నందున ఓటీటీలో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతుంది. చిత్ర నిర్మాతలు కూడా ఈ విషయంలో మొదట కొద్దిగా విముఖత ప్రకటించినప్పటికీ, రోజులు గడుస్తున్నా  పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఓటీటీ రిలీజ్ కి సుముఖంగానే ఉన్నారని వినబడుతోంది.

ఈ నేపథ్యంలో నిశ్శబ్దం చిత్రం ఓటీటీలో రిలీ అవుతుందని అంటున్నారు. రిలీజ్ డేట్ కూడా చక్కర్లు కొడుతోంది. వి సినిమా డిజిటల్ హక్కులని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వి సినిమాని తీసుకుందని, గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఐతే ఈ విషయమై ఇప్పటికీ చిత్రనిర్మాతలు స్పందించలేదు. కాకపోతే అనుష్క శెట్టి హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన నిశ్శబ్దం ఓటీటీలో వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. తమిళ నటుడు ఆర్ మాధవన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. హీరోయిన్ అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

NIssabdam OTT release date fix..?:

NIssabdam OTT release date fix..?


Loading..
Loading..
Loading..
advertisement