Advertisementt

నేను బ్రతికున్నానని చెప్పడానికే బిగ్ బాస్ లోకి వచ్చా..

Tue 15th Sep 2020 09:51 PM
biggbosstelugu,suryakiran,telugu,nagarjuna  నేను బ్రతికున్నానని చెప్పడానికే బిగ్ బాస్ లోకి వచ్చా..
Bigg Boss contestent comments on.. నేను బ్రతికున్నానని చెప్పడానికే బిగ్ బాస్ లోకి వచ్చా..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ రియాలిటీ షో మొదలై మొదటి ఎలిమినేషన్ కంప్లీట్ చేసుకుంది. మొదటి ఎలిమినేషన్ గా డైరెక్టర్ సూర్యకిరణ్ హౌస్ నుండి బయటకు వచ్చాడు. ఐతే ఇది అందరూ ఊహించిందే. గత సీజన్లలో మొదటి ఎలిమినేషన్ గా అందరూ ఆడవాళ్లే ఎలిమినేట్ అయ్యారు. కానీ ఈ సారి ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సూర్య కిరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, తానెందుకు హౌస్ లోకి వెళ్లాడో చెప్పాడు.

సత్యం సినిమా తర్వాత తాను చాలా సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదన్నాడు. ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు చెన్నై వెళ్ళాను. నేనెక్కడున్నానో, ఏమయ్యానో ఎవరికీ తెలియలేదు. దాంతో నేను చనిపోయానని అనుకున్నారు. అలాంటి వాళ్లకి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పడానికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నేననుకున్న పర్పస్ నెరవేరిందని అన్నాడు.

ఇంకా హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ, వారంతా హౌస్ లో కూడా యాక్ట్ చేస్తున్నారని, వాళ్ల ప్రవర్తన మరీ చిత్రంగా ఉందని, వర్షం పడితే, అదే మొదటిసారి వర్షాన్ని చూస్తున్నాం అన్నట్టుగా, బిర్యానీ ఇస్తే మొదటి సారి బిర్యానీ చూస్తున్నంతగా బిహేవ్ చేస్తున్నారని, వాళ్లంతా కేవలం యాక్టింగ్ చేస్తున్నారని కౌంటర్లు వేసాడు.

Bigg Boss contestent comments on..:

Bigg Boss contestent comments on..

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ