లేడీ జర్నలిస్టుకి మతిపోయే కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి..

Maruti counter comments on..

Mon 14th Sep 2020 08:28 PM
virat kohli,anushka sharma,director maruti,social media  లేడీ జర్నలిస్టుకి మతిపోయే కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి..
Maruti counter comments on.. లేడీ జర్నలిస్టుకి మతిపోయే కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి..
Advertisement

సెలెబ్రిటీ కపుల్ కోహ్లీ, అనుష్క శర్మ.. తల్లిదండ్రులుగా మారబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ, బేబి బంప్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో ఉంచారు. ఐతే ఈ ఫోటోపై లేడీ జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా ఆమె మాట్లాడుతూ, అతను నిన్ను గర్భవతిని చేసాడు, ఇంగ్లాండ్ కి రాణీని కాదు. కొంచెం తగ్గించుకో అన్నట్టుగా మాట్లాడింది.

ఒక మహిళా జర్నలిస్ట్ మరో మహిళపై అలాంటి కామెంట్స్ చేయడం నిజంగా షాకింగే. ఐతే ఈ జర్నలిస్టుకి కౌంటర్ వేసిన మారుతి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఆ కామెంట్లని తప్పుబడుతూ, అమ్మతనం అనేది ఇంగ్లాండ్ కి రాణి అవడం కన్నా చాలా ఎక్కువ. అవును ప్రతీ మహిళా రాణే, ఎల్లప్పుడూ సంతోషాలు వెల్లివిరిసే ఇల్లే ఆమె రాజ్యం.  సెలెబ్రిటీ కాకముందు ఆమె కూడా ఒక సాధారణ మహిళ. ఇంకా తల్లిగా మారబోతున్న ఆమెకి, ఆ సంతోషం ఒక హక్కు... అంటూ తనదైన మాటలతో దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చాడు.

Click here for Tweet

Maruti counter comments on..:

Maruti counter comments on..


Loading..
Loading..
Loading..
advertisement