Advertisement

కరోనా కారణం.. స్క్రిప్టుల్లో మార్పులు...

Mon 07th Sep 2020 09:33 AM
deepika padukone,bollywood,shakun batra,ananya pandey  కరోనా కారణం.. స్క్రిప్టుల్లో మార్పులు...
Corona reason.. Script changes. కరోనా కారణం.. స్క్రిప్టుల్లో మార్పులు...
Advertisement

కరోనా కారణంగా సినిమా షూటింగ్ అంటే భయపడుతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన షూటింగుల్లో ఎవరో ఒకరు కరోనా బారిన పడడంతో మిగతా సినిమాల వారు షూటింగ్ మొదలెట్టాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు, దర్శకులు రిస్క్ తీసుకోవద్దని డిసైడ్ అయ్యారు. ఐతే ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద సినిమా షూటింగులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగులో నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రీకరణ మొదలు పెట్టాడు.

అటు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కూడా స్టార్ట్ చేసాడు. ఐతే షూటింగ్స్ మొదలవుతున్నాయి కానీ లొకేషన్ పరంగా మార్పులు కోరుకుంటున్నారట. ఇతర దేశాల్లో చిత్రీకరణ అంటే అస్సలు వద్దని అంటున్నారట. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ మేరకు డిమాండ్ చేసిందట. కపూర్ అండ్ సన్స్ డైరెక్టర్ షకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే కూడా నటిస్తుంది.

ఐతే ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో ప్లాన్ చేసుకున్నారట. కానీ కరోనా వల్ల ఇప్పుడు గోవాకి మార్చేసారట. ఈ మేరకు స్క్రిప్టులో చాలా మార్పులు వచ్చాయట. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో షూటింగులని దీపికా నో చెప్పడంతో గోవాకి మార్చారట. 

Corona reason.. Script changes.:

Corona reason.. Script changes.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement