పెళ్లి చేసుకొని తప్పు చేశా.. త్వరలో విడిపోతాం!

News about Actress Swathi naidu

Mon 03rd Aug 2020 12:16 AM
actress swathi naidu,swathi naidu marriage,avinash,divorce,drinker,tollywood,bold actress  పెళ్లి చేసుకొని తప్పు చేశా.. త్వరలో విడిపోతాం!
News about Actress Swathi naidu పెళ్లి చేసుకొని తప్పు చేశా.. త్వరలో విడిపోతాం!
Advertisement

అవును.. తాను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానని.. త్వరలో విడిపోతామని చెబుతోంది ఓ హాట్ భామ. ఇంతకీ ఎవరా హాట్ అనుకుంటున్నారా..? అదేనండోయ్.. శృంగారభరిత కథల్ని చెప్పి రక్తికట్టించడంలో ఆరితేరిన బ్యూటీ స్వాతి నాయుడు. ఇంతకీ ఈమె బాధేంటి..? ఎందుకు పెళ్లి చేసుకుంది..? ఇప్పుడు ఎందుకు విడిపోవాలని అనుకుంటోంది..? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? అనే విషయాలన్నింటినీ ఓ వీడియో రూపంలో స్వాతి నాయుడు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ విషయాలేంటో ఒకసారి చూద్దాం.

అప్పుడు.. ఇప్పుడు..!?

తెలుగు పోర్న్ యాక్టర్ స్వాతి నాయుడు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా.. యూ ట్యూబ్‌, సోషల్ మీడియాపై కాస్త అవగాహన ఉన్నవాళ్లకు అస్సలే పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకుంటే.. ఈ హాట్ బ్యూటీ చేసిన యవ్వరాలు అలాంటివి మరి. ఒక్క మాటలో చెప్పాలంటే పైసలిస్తే చాలు సన్నిలియోన్‌ను మించిపోయే వీడియోలు చేస్తానని అప్పట్లో గట్టిగానే హడావుడి చేసింది. ఈమె యూట్యూబ్‌లో వీడియోలు పెట్టినా.. తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ హాట్ పిక్స్ పెట్టిన కుర్రకారు ఎగబడీ మరీ చూసేవారు. అయితే స్వాతి హాట్‌ బాడీని కొందరు వ్యాపారంగా మార్చేసి ఆమెను నట్టేట ముంచేశారు కూడా. అలాంటి తరుణంలో ‘నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వొప్పుకుంటే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను’ అంటూ ఒకడు స్వాతి లైఫ్‌లోకి వచ్చాడు. అయితే ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో అవినాష్‌-స్వాతి నాయుడి పెళ్లి పెద్దల మధ్యే జరిగింది. నిజంగా ఈమెను పెళ్లి చేసుకున్నప్పుడు అభిమానులు, పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే కొందరు మాత్రం వీరి బంధం ఎన్నాళ్లో సాగదని.. కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పట్లోనే చెప్పారు. అనుకున్నట్లుగానే ఆమెకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి.

చాలా పెద్ద తప్పు చేశా..!

ఈ మధ్యే మాకు పాప పుట్టింది. ఇంతవరకూ మేం కాస్తో కూస్తో సంతోషంగానే ఉన్నాం. పాప పుట్టడంతో కాస్త టెన్షన్ మొదలైంది. కొత్తగా ఓ ఇళ్లు కట్టుకుంటున్నాం. నా భర్తే దగ్గరుండి ఆ ఇంటి పనులు చూసుకుంటున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. నా భర్త రాత్రయితే చాలు రోజూ వేధిస్తున్నాడు. ఇంటి పనుల్లో కొంచెం కూడా సాయం చేయట్లేదు. కనీసం పాపను పట్టించుకోవట్లేదు. ఏం మాట్లాడినా అస్తమాను కోపగించుకోవడం.. మద్యం సేవించడం చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే కాళ్లు, చేతులపై కోసుకుంటున్నాడు. దీంతో ప్రతిరోజూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నిజంగా ఆయన్ను పెళ్లి చేసుకుని నేను తప్పు చేశాను. వాస్తవానికి నేను ఆయన్ను చేసుకోలేదు.. ఆయనే ఇష్టపడి వచ్చి మరీ చేసుకున్నాడు. నిజంగా నేను పెళ్లి చేసుకొని చాలా పెద్ద మిస్టేక్ చేశా. తాగుడు మానేయమంటే అస్సలు మానను అంటున్నాడు. అవసరమైతే నిన్ను, పాపను వదిలేస్తానని చెబుతున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు మొదలుకుని పాప పుట్టినంతవరకూ నాకు అన్నీ కష్టాలేఅని హాట్ బ్యూటీ చెబుతోంది.

త్వరలో విడిపోతాం!

ఇక నేను భర్తతో కలిసి ఉండలేను. త్వరలో మేం విడిపోవడం ఖాయం. అవినాష్‌ను నేను భరించలేను. నన్ను చాలా మంది డబ్బులు తీసుకుని ఏడిపించారు. నా భర్త ఇంకో అడుగు ముందుకేసి పాప పుట్టిన తర్వాత ఇలా వేధించడం మొదలుపెట్టాడు. పాపను కూడా ఆయనకే వదలేసి నేను ఒక్కదాన్నే దూరంగా వెళ్లి పోదామనుకొని నేను డిసైడ్ అయ్యానుఅని స్వాతి తన బాధను వీడియో రూపంలో చెప్పుకొచ్చింది. మొత్తానికి చూస్తే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానని స్వాతి చెబుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అవినాష్ స్పందిస్తే కానీ తెలియవు. కాగా.. కొద్దిరోజుల పాటు యూ ట్యూబ్ చానెల్స్‌కు స్వాతి రూపంలో ఇంటర్వ్యూల పండుగ రానుందని చెప్పుకోవచ్చు.

News about Actress Swathi naidu:

I did big mistake with Marriage says Swathi naidu


Loading..
Loading..
Loading..
advertisement