అక్కినేని నాగ్‌ సరసన ఇలియానా!?

Goa Beauty ileana To Romance Nagarjuna!

Mon 03rd Aug 2020 12:23 AM
goa beauty,ileana,ileana dcruz,romance nagarjuna,king nagarjuna,praveen sattaru  అక్కినేని నాగ్‌ సరసన ఇలియానా!?
Goa Beauty ileana To Romance Nagarjuna! అక్కినేని నాగ్‌ సరసన ఇలియానా!?
Advertisement

కింగ్ నాగార్జున-‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో ఓ సినిమా రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది!. అంతేకాదు.. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని కూడా టాక్ నడుస్తోంది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తాము సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

కాగా.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టాలీవుడ్‌లో కొత్త కబురు వినిపిస్తోంది. అదేమిటంటే.. అందాల భామ, వయ్యారి నడుము సుందరి ఇలియానా.. నాగ్ సినిమాతో రీ- ఎంట్రీ ఇవ్వబోతోంద‌ట. వాస్తవానికి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడానికి మంచి కాంబినేష‌న్ కోసం ఈ భామ చాలా రోజులుగా ఎదురు చూస్తోంది. కానీ ఆ రోజు రానే వచ్చేసింది. అనుకున్నట్లుగానే నాగ్ రూపంలో అది సాధ్యమవుతోంది. అంటే నాగ్ సరసన ఇలియానా రొమాన్స్ చేయనుందన్న మాట. భారీ యాక్షన్ థ్రిలర్ సినిమా కావడం.. అందులోనూ కథానాయిక పాత్ర టామ్ బోయ్‌లా ఉండాలి అందుకే ఇలియానాను ఎంచుకున్నారని తెలిసింది.

వాస్తవానికి ..‘దేవదాసు’ చిత్రం తర్వాత ఇలియానాతో ఓ సినిమా చేయాలని నాగ్ అనుకున్నాడు కానీ కుదరలేదు. ఆ తర్వాత ఓ బాలీవుడ్‌ రీమేక్ మూవీకి గాను నాగ్ సరసన ఇలియానాను తీసుకోవాలని భావించారు. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఫైనల్‌గా మన్మథుడితో ఇల్లీ బేబి రొమాన్స్‌కు సమయం ఆసన్నమైంది. నాగ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఇల్లీ సూపర్ హిట్టవుతుందో లేకుంటే అడ్రస్ లేకుండానే పోతుందో తెలియాలంటే ముందు అధికారిక ప్రకటన ఆ తర్వాత సినిమా పూర్తయ్యి థియేటర్లలోకి రావాల్సిందే మరి.

Goa Beauty ileana To Romance Nagarjuna!:

Goa Beauty ileana To Romance Nagarjuna!  


Loading..
Loading..
Loading..
advertisement