సుశాంత్ అభిమానులకి హాట్ స్టార్ అపురూప కానుక...

Tue 07th Jul 2020 09:59 AM
sushanth singh rajput,dil bechara,disney hotstar,ott,bollywood  సుశాంత్ అభిమానులకి హాట్ స్టార్ అపురూప కానుక...
Sushanth Last will be streaming on Disney Hotstar for free.. సుశాంత్ అభిమానులకి హాట్ స్టార్ అపురూప కానుక...

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కై పోచే, ఎమ్ ఎస్ ధోనీ, చిచోరే వంటి అద్భుతమైన చిత్రాల్లో హీరోగా నటించి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సుశాంత్ మరణాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోయింది. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం డిప్రెషన్ అనీ, బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన నెపోటిజం వల్లే సుశాంత్ సినిమా అవకాశాలు దెబ్బ్బతిన్నాయనీ, అందువల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని నెటిజన్లు బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కారణమేదైనా బాలీవుడ్ ఒక మంచి నటుడిని కోల్పోయింది. అయితే సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచరా పై ప్రస్తుతం చర్చ నడుస్తుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో బాలీవుడ్ లోని చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఆ చాలా సినిమాల్లో సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచరా కూడా ఒకటి. అయితే నిజానికి సుశాంత్ అభిమానులు ఈ సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నిర్మాతలని రిక్వెస్ట్ చేసారు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ అయ్యేవరకూ వేచి ఉండడం కంటే ఓటీటీలో రిలీజ్ చేయడమే ఉత్తమం అని భావించిన నిర్మాతలు డిస్నీ హాట్ స్టార్ స్ట్రీమింగ్ సైట్ కి అమ్మేసారు. దిల్ బేచరా ఈ నెల 24వ తేదీ నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవనుంది. అయితే ఇక్కడ హాట్ స్టార్ సుశాంర్ అభిమానుల కోసం ఈ సినిమాని ఫ్రీగా ఉంచనుందట. సాధారణంగా డైరెక్ట్ రిలీజ్ అయ్యే సినిమాలని చూడాలంటే ప్రీమియం మెంబర్ షిప్ ఉండాలి.

కానీ సుశాంత్ చివరి చిత్రమైన దిల్ బేచరా సినిమాని అందరికీ అందుబాటులో ఉంచడానికి వీలుగా ప్రీమియం మెంబర్షిప్ లేకపోయినా ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

Sushanth Last will be streaming on Disney Hotstar for free..:

Sushanth Last will be streaming on Disney Hotstar for free..