ఉప్పెన.. అలా వచ్చే అవకాశమే లేదు..!

Uppena will comt to theatres..

Tue 07th Jul 2020 02:48 AM
uppena,panja vaishnav tej,sai dharam tej,buchchibabu sana,sukumar,mythri movie makers  ఉప్పెన.. అలా వచ్చే అవకాశమే లేదు..!
Uppena will comt to theatres.. ఉప్పెన.. అలా వచ్చే అవకాశమే లేదు..!
Advertisement

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న సంక్షోభం కారణంగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునేలా కనబడట్లేదు. లాక్డౌన్ కన్నా ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. హైదరాబాద్ కోవిడ్ 19కి ఎపిసెంటర్ గా మారింది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల వరకూ థియేటర్లపై ఆశలు పెట్టుకోవడం వృధానే. అందువల్ల ఆల్రెడీ రిలీజ్ కి రెడీ ఉన్న సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

లాక్డౌన్ మొదట్లో ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకోని చిత్రాలు సైతం ప్రస్తుత పరిస్థితుల వల్ల చేసేదేమీ లేక డిజిటల్ కి ఇచ్చేస్తున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన చిత్రం డైరెక్ట్ థియేటర్లోనే రిలీజ్ అవనుందట. థియేటర్లు ఓపెన్ కావడం ఎంత ఆలస్యమైనా ఉప్పెన చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తారట.

అయితే దానికి కారణం కూడా ఉందని అంటున్నారు. సాధారణంగా ఓటీటీలో స్టార్ వాల్యూ ఉన్న సినిమాలకి ఎక్కువ రేటు పలుకుతుంది. ఆ లెక్కన చూసుకుంటే ఉప్పెన చిత్రానికి అలాంటి ప్లస్ పాయింట్స్ లేవు. మేగా మేనల్లుడి మొదటి చిత్రం కావడంతో జనాల్లో కొద్దిగా ఆసక్తి ఉంటుంది. కానీ అదొక్కటే ఆ సినిమాకి 25కోట్లకి పైగా రాబడిని తెచ్చిపెట్టదు. ఉప్పెన చిత్రానికి 20కోట్లకి పైగా ఖర్చు చేసారట. 

అయితే చిన్న సినిమాకి ఓటీటీలు అంత ఇచ్చుకోలేవు. ఇలా పలు కారణాల వల్ల ఉప్పెన చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇష్టపడట్లేదట. అదీగాక ఈ సినిమా అద్భుతం సృష్టిస్తుందని మేకర్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. సో ఎంత ఆలస్యమైనా ఉప్పెన థియేటర్లలోనే వస్తుందన్నమాట.

Uppena will comt to theatres..:

Uppena will comt to theatres..


Loading..
Loading..
Loading..
advertisement