‘వంగవీటి రంగా’గా సురేష్ కొండేటి!

Devineni Movie Vangaveeti Ranga Look Released

Sun 05th Jul 2020 01:33 PM
vangaveeti ranga,birth anniversary,devineni movie,ranga role,suresh kondeti  ‘వంగవీటి రంగా’గా సురేష్ కొండేటి!
Devineni Movie Vangaveeti Ranga Look Released ‘వంగవీటి రంగా’గా సురేష్ కొండేటి!
Advertisement

దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేష్‌ కొండేటి నటిస్తున్న ‘దేవినేని’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో జి.ఎం. ఎన్  ఫిలిమ్స్, ఆర్‌.టి.ఆర్‌ ఫిలింస్‌ సంయుక్తంగా జి.ఎస్‌.ఆర్‌.చౌదరి, రామూరాథోడ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం వంగవీటి రంగా జయంతి సందర్భంగా వంగవీటి రంగా పాత్ర పోషిస్తున్న సురేష్ కొండేటికి సంబంధించిన స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ..  ‘‘ఆనాటి మహాభారతం, రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే మనకు తెలుసు. వారిద్దరి మధ్యా ఎలాంటి సంఘర్షణ జరిగింది, అది ఘర్షణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అని వివరించారు. ఈ సినిమాకి మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందించిన రీ-రికార్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఫుల్ లెన్త్ గా వంగవీటి రంగా పాత్రల్లో చేస్తున్న సురేష్ కొండేటి క్యారెక్టర్ మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా త్వరలో థియేటర్లోనే విడుదవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ ఆవుల వెంకటేష్.

Devineni Movie Vangaveeti Ranga Look Released:

Vangaveeti Ranga Birth Anniversary special: Devineni Movie Ranga role new stills released


Loading..
Loading..
Loading..
advertisement