Advertisement

జూలై 10న ‘జీ5’లో ‘బెలూన్’..!

Sun 05th Jul 2020 01:23 PM
balloon movie,release date,zee5,ott,direct release,anjali,jai  జూలై 10న ‘జీ5’లో ‘బెలూన్’..!
BALLOON Movie release date Fixed జూలై 10న ‘జీ5’లో ‘బెలూన్’..!
Advertisement

జూలై 10న ‘జీ5’లో ‘బెలూన్’‌ డైరెక్ట్‌-ఓటీటీ రిలీజ్‌

తెలుగమ్మాయి అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ సినిమా ‘బెలూన్‌’. రాజ్‌తరుణ్‌ అతిథి పాత్రలో నటించారు. శినీష్‌ దర్శకత్వం వహించారు. దిలీప్‌ సుబ్బరాయన్‌, అరుణ్‌ బాలాజీ, నందకుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌ జీ ఛానల్స్‌కి సంబంధించిన ఓటీటీ ‘జీ 5’లో ఈ సినిమా ఎక్స్‌క్లూజీవ్‌గా విడుదల కానుంది. జూలై 10 నుండి సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని ‘జీ 5’ పేర్కొంది.

లాక్‌డౌన్‌లో తెలుగు ప్రజలకు జీ 5 మంచి కాలక్షేపం అందించింది. స్ఫూర్తిదాయక వెబ్‌ సిరీస్‌ ‘లూజర్’‌ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ‘అమృతం ద్వితీయం’ నవ్వించింది. ఇటీవల విడుదలైన ‘47 డేస్’ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, చక్కటి కథతో వీక్షకాదరణ పొందుతోంది. ఎక్స్‌క్లూజీవ్‌ తెలుగు సిరీస్‌లు, సినిమాలతో పాటు వివిధ భాషల్లో 100కు పైగా ఒరిజినల్‌ సిరీస్‌లు, ఎక్స్‌క్లూజీవ్‌ సినిమాలతో ప్రజాదరణ పొందుతూ... డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ సినిమాలకు ‘జీ 5’ మంచి వేదికగా నిలిచింది. త్వరలో, ఈ నెల 10న ‘బెలూన్’‌ విడుదల చేస్తోంది.

‘బెలూన్’ కథ విషయానికి వస్తే... జీవానంద్‌ (జై) ఓ స్ర్కిప్ట్‌ రాయాలని తన భార్య (అంజలి), మేనల్లుడు (మాస్టర్‌ రిషి)తో కలిసి ఊటీ వెళతాడు. అక్కడ ఓ పాత ఇంటిలో ఉంటాడు. గతాన్ని గుర్తుచేసే ఊహించని ఘటనలు జరుగుతాయి. తర్వాత ఏమైందనేది ‘జీ 5’లో చూడాలి. యోగిబాబు, నాగినీడు, జాయ్‌ మాథ్యూ, రామచంద్రన్‌ దురైరాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు: ఆర్‌. శరవణన్‌, సౌండ్‌ డిజైన్స్‌: సచిన్‌, సుధాకర్‌, సంగీత దర్శకుడు: యువన్‌ శంకర్‌ రాజా.

BALLOON Movie release date Fixed:

ZEE5’s NEXT DIRECT TO DIGITAL EXCLUSIVE OTT TELUGU RELEASE BALLOON

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement