భీమవరం టాకీస్ వారి సరికొత్త ప్రయత్నం!

bhimavaram talkies introduces ATT System in tollywood

Mon 29th Jun 2020 05:20 PM
Advertisement
tummalapalli rama satyanarayana,bhimavaram talkies,introduces,att system,tollywood  భీమవరం టాకీస్ వారి సరికొత్త ప్రయత్నం!
bhimavaram talkies introduces ATT System in tollywood భీమవరం టాకీస్ వారి సరికొత్త ప్రయత్నం!
Advertisement

మారుతున్న టెక్నాలజీతో మనం మారుదాం, సినిమా జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త మార్గాన్ని వెలికితీశారు. భవిష్యత్ అంతా చిన్న సినిమాలకి ఏటిటి ఏ కరెక్ట్ దారి. దీనివల్ల చిన్న సినిమా విడుదలలో ఎదుర్కొంటున్నా అనేక సమస్యలకి పరిష్కారం దొరికింది. ఉదాహరణకు ఒక చిన్న బడ్జెట్ సినిమా విడుదలకు టీవీ పేపర్ పోస్టర్స్ ఆడియో ఫంక్షన్స్, హోర్డింగ్స్ లాంటి పబ్లిసిటీ ప్రమోషన్‌లకు 25 నుండి 50 లక్షలు అవుతుంది మరియు 50 థియేటర్స్ లో విడుదల చేస్తే 7.50 లక్షలు. డిజిటల్‌కి కట్టాలి కొన్ని థియేటర్స్ కి రెంట్ కట్టాలి ఇవీ అన్ని దాటుకుని ప్రేక్షకుడు 100/150 టికెట్ కొని చూస్తారు అని నమ్మకం లేదు, కలెక్షన్స్ లేకపోతే థియేటర్స్ ఇవ్వరు ఇన్నీ సమస్యల మధ్య చిన్న బడ్జెట్ మూవీ విడుదల చేస్తే కలెక్షన్స్ లేకపోవటం వల్ల ఒక రోజు లోనే సినిమా తీసివేసి అవకాశం ఉంది...ఇక ఈ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది.

ఇప్పుడు శ్రేయస్ ఈటీ వాళ్ళు పే పర్ వ్యూ పద్దతిలో క్లైమాక్స్, నగ్నం అనే సినిమాలు విడుదల చేసి విజయం పొందారు. ఇదే బాటలో భీమవరం టాకీస్..పేరుమీద ఒక(ఓటిటి) / ఏటిటిని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది ఒక మల్టిప్లెక్స్ థియేటర్ లాంటిది, ఇందులో ఈ ATT లో మేము సినిమాలు కొనము, ఎవరైనా కొంటే అమ్ముకునే హక్కులు/నిర్ణయం నిర్మాతదే.

నిర్మాతలు మా థియేటర్ లో మీకు నచ్చిన సినిమాని మీరు పెట్టుకోండి. ప్రమోషన్ మేము /మీరు చేసుకోవాలి. టికెట్ ధర 50/75 మాత్రమే ఉంటది.. ప్రేక్షకుడు ట్రైలర్ ప్రమోషన్ చూసి నచ్చిన సినిమాకు మాత్రమే టికెట్ పే చేసీ చూస్తాడు. నిర్మాత ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. ATT లో వుంచుకోవచ్చు. ఏదైనా బయర్ వస్తే నిర్మాత అమ్ముకోవచ్చు.. పూర్తి స్వేచ్ఛ, హక్కులు నిర్మాతకే ఉంటాయి.

ఒక టికెట్ ఎవరైనా కొంటే ఆ నిర్మాతకి ఎస్ఎమ్ఎస్ వస్తుంది ఆ డబ్బు/షేర్ అతని అకౌంట్‌కి 14 రోజుల్లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇతరమైన పై పబ్లిసిటీ ఖర్చులు నిర్మాతకు వృధా అవ్వదు. నిర్మాత తీసిన సినిమా క్వాలిటీ.. కంటెంట్‌ని బట్టి ప్రేక్షకుడు చూస్తాడు.. సినిమాను చూడాలి అనుకున్న ప్రేక్షకులు 3 రోజుల్లో అందరూ చూస్తారు. తర్వాత పైరసీ వచ్చిన మనకి నష్టం ఉండదు. ఇదీ చాలా మంచి ప్రయత్నం. భవిషత్తులో చిన్న సినిమాలు ATT లో పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్స్ లో ఉండబోతున్నాయని.. నిర్మాతల మండలి కూడా ఇలాంటి ATT యాప్‌ను త్వరలో స్టార్ట్ చేసీ చిన్న బడ్జెట్ నిర్మాతల కోసం ప్రయత్నం చేస్తుంది.. అని నిర్మాత తుమ్ములపల్లి రామసత్యనారాయణ తెలిపారు.

Advertisement

bhimavaram talkies introduces ATT System in tollywood:

Tummalapalli Rama Satyanarayana started new business

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement