అలీ హీరోగా నటిస్తోన్న 53వ చిత్రమిదే..!

Ali New Movie Maa Ganganadi Trailer released

Mon 29th Jun 2020 03:03 PM
Advertisement
ali,maa ganganadi,trailer release,maa ganganadi trailer,hero ali 53rd film  అలీ హీరోగా నటిస్తోన్న 53వ చిత్రమిదే..!
Ali New Movie Maa Ganganadi Trailer released అలీ హీరోగా నటిస్తోన్న 53వ చిత్రమిదే..!
Advertisement

అలీ హీరోగా నటిస్తోన్న 53వ చిత్రం ‘మా గంగానది’ ట్రైల‌ర్ విడుద‌ల‌

అలీ, నియా హీరో హీరోయిన్లుగా ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో మూకాంబికా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.బాల నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వి.నాగేశ్వ‌ర‌రావు, సూర్య‌వంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ‘మా గంగానది’. ‘అంత పవిత్ర‌మైనది స్త్రీ’ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రంలో అలీ కుమార్తె బేబీ జువేరియా న‌టించ‌డం విశేషం. ఈ సినిమా ట్రైల‌ర్‌ను హీరో అలీ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో అలీ, డైరెక్ట‌ర్ వి.బాల నాగేశ్వ‌ర‌రావు, నిర్మాత‌లు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా హీరో అలీ మాట్లాడుతూ.. ‘‘మా గంగానది చిత్ర ట్రైలర్‌ను విడుద‌ల చేస్తున్నాం. సాధార‌ణంగా మ‌నం న‌టించిన సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్‌ను మ‌రొక‌రిచేత విడుద‌ల చేయిస్తుంటాం. కానీ క‌రోనా వ‌ల్ల అంద‌రూ సామాజిక దూరం పాటించాల్సి వ‌స్తుంది. అందుక‌ని నా సినిమా ట్రైల‌ర్‌ను నేనే గెస్ట్‌గా మారి విడుద‌ల చేస్తున్నాను. సినిమాలో తొలిసారి సీరియస్ పాత్ర చేశాను. ఇందులో నా కుమార్తె పాత్ర‌లో నా కూతురు జువేరియా న‌టించింది. జువేరియాల‌ను స్క్రీన్‌పై చూడాల‌నేది వాళ్ల అమ్మ ఆశ. చిన్న‌ప్పుడు స్క్రీన్‌పై న‌న్ను చూసుకుని మా అమ్మ ఎలా సంతోష‌ప‌డిందో, నా భార్య‌కు కూడా మా అమ్మాయిని స్క్రీన్‌పై చూసి ఆనంద‌ప‌డాల‌ని ఎప్ప‌టి నుండో కోరిక‌. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కేర‌ళ అమ్మాయి నియా హీరోయిన్‌గా న‌టించింది. ఇంకా చాలా మంది న‌టీన‌టులు నటించారు. హీరోగా 53వ సినిమా. లాక్‌డౌన్‌కి ముందే సినిమా రెడీ అయ్యింది. కానీ ప‌రిస్థితులు వ‌ల్ల లాక్‌డౌన్ రావ‌డంతో మేం క‌లుసుకోలేదు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ప్రేక్ష‌క దేవుళ్ల ఆశీర్వాదం త‌ప్ప‌క ఉంటుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

డైరెక్టర్ వి.బాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యంగా స్త్రీ సమస్యలపై రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో అలీగారి చిన్న కుమార్తె జువేరియా కూడా న‌టించ‌డం విశేషం. తప్పకుండా ఈ సినిమాను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

అలీ, నియా, బేబీ జువేరియా త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు:

కెమెరా: ప‌్ర‌వీణ్ వ‌న‌మాలి

సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌

ఎడిటింగ్‌: ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌

నిర్మాత‌లు: వి.నాగేశ్వ‌ర‌రావు, సూర్య‌వంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వి.బాల‌నాగేశ్వ‌ర‌రావు

Advertisement

Ali New Movie Maa Ganganadi Trailer released:

Ali Released His Maa Ganganadi Movie trailer

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement