నాని వి నుండి లేటెస్ట్ అప్డేట్.. మిలిటరీ మేజర్ పాత్రలో..?

నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా, కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది. లాక్డౌన్ మొదట్లో ఓటీటీలోకి వచ్చేస్తుందని వార్తలు వినిపించినప్పటికీ, థ్రిల్లర్ సినిమాలని థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి కలుగుతుందన్న ఉద్దేశ్యంతో చిత్రబృందం థియేటర్లు ఓపెన్ అయ్యే వరకూ వెయిట్ చేయనుందట. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడని తెలిసిందే. 

సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్న ఈ చిత్రంలో నివేథా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని- ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కిన మూడవ చిత్రమైన వి సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ లో నాని నటన ఎలా ఉండనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాని పాత్ర గురించి మరో అప్డేట్ బయటకి వచ్చింది. 

సీరియల్ కిల్లర్ గా కనిపించనున్న నాని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మిలిటరీ మేజర్ గా కనిపిస్తాడట. ఈ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ ని కలిగించే విధంగా ఉంటాయని అంటున్నారు. అష్టా చమ్మా, సమ్మోహనం, అమీ తుమీ వంటి ఫ్యామిలీ డ్రామాలని అందంగా చూపించిన ఇంద్రగంటి థ్రిల్లర్ సినిమాని ఏ విధంగా డీల్ చేసాడన్నది ఆసక్తికరం.

Latest update from Nani V..

Latest update from Nani V..
nani
v the movie
indraganti mohanakrishna
nivetha thomas
aditi rao hydari
sudheer babu