Advertisement

తేజ సూచించిన వాటిని అమలు పర్చడం కష్టం అంటున్నారే..

Sat 06th Jun 2020 04:36 PM
teja,covid19,coronavirus,producers,telugu,telugu film industry  తేజ సూచించిన వాటిని అమలు పర్చడం కష్టం అంటున్నారే..
It is difficult to to follow Teja rules.. తేజ సూచించిన వాటిని అమలు పర్చడం కష్టం అంటున్నారే..
Advertisement

కరోనా మూలాన షూటింగులు లేక సినిమా ఇండస్ట్రీ వారు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షూటింగులకి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో షూటింగులో పాటించాల్సిన గైడ్ లైన్స్ ని తయారు చేసే పనిలో ఉంది. అలాగే ఇండస్ట్రీ నుండి కొన్ని సలహాలని కోరింది. దాంతో తెలుగు సినిమా పెద్దలంతా కలిసి గైడ్ లైన్స్ సూచించే బాధ్యతని సీనియర్ దర్శకుడు తేజకి అప్పగించారు.

వర్క్ విషయంలో తేజ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడని టాక్ ఉంది. అయితే ఈ గైడ్ లైన్స్ విషయంలోనూ తేజ మరీ స్ట్రిక్ట్ గా వ్యవహరించాడని అంటున్నారు. తేజ సూచించిన వాటిలో చాలా వాటిని పాటించడం కష్టం అవుతుందని వాదిస్తున్నారు. తేజ సూచించిన గైడ్ లైన్స్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్లని తీసుకుంటే, షూటింగ్ స్పాట్లో నటీనటులు తప్ప మిగతా వారందరూ పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ వేసుకోవాలని సూచించాడు.

అంతే కాదు సెట్స్ లో అసలు భోజనం వద్దని, ఇంటివద్ద నుండే ఎవరి క్యారియర్ వారు తెచ్చుకోవాలని రికమెండ్ చేసాడు. అదీ గాక అరవై ఏళ్ళకి పైబడిన వారిని సెట్స్ లోకి అనుమతించకూడదని కూడా ఉందట. అయితే వీటన్నింటినీ పాటిస్తూ షూటింగ్స్ చేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుందో..!

It is difficult to to follow Teja rules..:

It is difficult to to follow Teja rules..

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement