ప్రతిష్టాత్మక బ్యానర్ లో తమిళ హీరో తెలుగు చిత్రం..?

Sat 06th Jun 2020 04:11 PM
vijay sethupathi,mythri movie makers,sai dharam tej,vaishnav tej,uppena  ప్రతిష్టాత్మక బ్యానర్ లో తమిళ హీరో తెలుగు చిత్రం..?
Tamil Hero Telugu movie is on board..? ప్రతిష్టాత్మక బ్యానర్ లో తమిళ హీరో తెలుగు చిత్రం..?
Sponsored links

తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో కనిపించిన విజయ్ సేతుపతి, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న ఉప్పెన చిత్రంలో ఒకానొక ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ద్వారా మనల్ని పలకరించబోతున్నాడు. అయితే విజయ్ సేతుపతి హీరోగా తెలుగు చిత్రం రాబోతుందట. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ సేతుపతి హీరోగా సినిమా రాబోతుందని సమాచారం.

ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉందట. విజయ్ కి తమిళనాట చాలా పాపులారిటీ ఉంది. అక్కడ విజయ్ ని ప్రేమగా మక్కల్ సెల్వం అని పిలుచుకుంటారు. తెలుగులో ఇప్పుడిప్పుడే ఒకటి రెండు పాత్రలు చేస్తున్న విజయ్, కంప్లీట్ హీరోగా దర్శనమివ్వడానికి రెడీ కాబోతున్నాడు. విజయ్ కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ప్రస్తుతానికి స్క్రిప్టు పనులు జరుగుతున్నాట. అన్నీ పూర్తయ్యాక ఈ విషయమై మైత్రీ మూవీ మేకర్స్ నుండి అధికారిక సమాచారం రానుంది.

తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

Sponsored links

Tamil Hero Telugu movie is on board..?:

Tamil Hero Telugu movie is on board..?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019