స్టార్ల వేటలో పుష్ప టీమ్..

Sat 06th Jun 2020 11:30 AM
pushpa,bunny,allu arjun,sukumar,rashmika mandanna,bollywood,vijay sethupathi,bobby simha,devi sri prasad  స్టార్ల వేటలో పుష్ప టీమ్..
Pushpa team serching for casting. స్టార్ల వేటలో పుష్ప టీమ్..
Sponsored links

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. అయితే ఒక సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయడమంటే చిన్న విషయం కాదు. పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికి పరభాషా నటీనటుల్ని తీసుకునే అవసరం ఉంటుంది.

ప్రస్తుతం పుష్ప టీమ్ అదే పనిలో ఉందట. ఆల్రెడీ తమిళ ప్రేక్షకుల కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నప్పటికీ, మళ్లీ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఇంకా విజయ్ సేతుపతి ఉన్నాడా లేడా అన్న విషయం కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉంటే సినిమాలో కొన్ని ముఖ్య పాత్రల కోసం పరభాషా నటీనటుల్ని ముఖ్యంగా బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నారట. అందుకోసం పుష్ప టీమ్ అన్నీ సిద్ధం చేసుకుంటుందట.

పుష్ప సినిమాలో ఈ ప్రత్యేకమైన పాత్రలో లేడీవిలన్ కోసం వెతుకుతున్నారని టాక్. ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటిని తీసుకోనున్నారని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో క్యాస్టింగ్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Sponsored links

Pushpa team serching for casting.:

Pushpa team serching for casting.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019