Advertisement

కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ టీజ‌ర్ ఎప్పుడంటే?

Sun 07th Jun 2020 01:08 PM
keerthi suresh,amazon prime video,penguin,teaser,8th june  కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ టీజ‌ర్ ఎప్పుడంటే?
Keerthi Suresh Penguin Teaser Release date Out కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ టీజ‌ర్ ఎప్పుడంటే?
Advertisement

జూన్ 8న విడుద‌ల కాబోతున్న కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ టీజ‌ర్

మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేశ్ అప్ క‌మింగ్ మూవీ పెంగ్విన్ ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్ గా జూన్ 19న విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ టు రిలీజ్ స్లాట్ లో త‌మ‌ స‌బ్ స్క్రైబర్స్ కు అందిస్తోంది. మ‌హాన‌టి త‌రువాత కీర్తి సురేశ్ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం కావ‌డంతో పెంగ్విన్ పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. 

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు విడుద‌ల చేసిన పెంగ్విన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న ల‌భించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పెంగ్విన్ టీజ‌ర్ ను జూన్ 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకం పై ద‌ర్శ‌కుడు, నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు.

Keerthi Suresh Penguin Teaser Release date Out:

Amazon Prime Video reveals the poster of Penguin, Teaser Out on 8th June

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement