‘ల‌వ్, లైఫ్ అండ్ ప‌కోడి’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Love Life and Pakodi Movie first Look Released

Tue 02nd Jun 2020 02:23 PM
Advertisement
love life and pakodi,first look,love life and pakodi movie  ‘ల‌వ్, లైఫ్ అండ్ ప‌కోడి’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
Love Life and Pakodi Movie first Look Released ‘ల‌వ్, లైఫ్ అండ్ ప‌కోడి’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
Advertisement

క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణలో రూపొందిన చిత్రం ‘ల‌వ్, లైఫ్ అండ్ ప‌కోడి’. జ‌యంత్ గాలి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేసింది చిత్రయూనిట్. ఆసక్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న ల‌భిస్తుంది. కార్తిక్, సంచిత హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్లో వీరి ఫోజ్ రోటీన్ లుక్స్ భిన్నంగా ఉంటూ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. ఒక రిలేష‌న్ కి క‌మిట్ అయ్యేందుకు క‌న్‌ఫ్యూజ్ అయ్యే జంటకు వారి మ‌ధ్య ప్రేమే స‌మ‌స్య‌గా ఎలా మారుతుంది అనేది ఆస‌క్తిగా తెర‌మీద‌కు క‌నువిందు చేయ‌బోతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూ.. ‘‘ఈ జ‌న‌రేష‌న్ ఏ రిలేష‌న్ క‌యినా క‌మిట్ అవ‌డానికి భ‌య‌ప‌డ‌తారు.క‌న్‌ఫ్యూజ్ అవుతారు..క‌రెక్టా కాదా అనే సందేహాల‌లో ప‌డిపోతారు. వారి మ‌ధ్య ఆక‌ర్ష‌ణ‌లు, ప్రేమ‌లు ఉంటాయి. కానీ వారి బాండింగ్‌కి ఎలాంటి రిలేష‌న్‌తో ముడి పెట్టడానికి ఇష్ట‌ప‌డ‌రు. అదే మా ప్రేమ క‌థ. మోడ్ర‌న్ క‌ల్చ‌ర్ లో నేటి జ‌న‌రేష‌న్ లివింగ్ స్టెయిల్ ని ప్ర‌తి బింబించే ఈ క‌థ త‌ప్ప‌కుండా యూత్ కి క‌నెక్ట్ అవుతుంద‌నే నమ్మ‌కం మాకు ఉంది. రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కి చాలా మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. థియేట‌ర్స్ కి అనుమ‌తులు ల‌భించ‌గానే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటాం..’’ అన్నారు.

కార్తిక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ‌ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఆక‌ర్ష్ రాజ్ భాగ‌వ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్, క‌ళా జ్యోతి, అనురాధ మ‌ల్లికార్జున ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

డిఓపి: సాగ‌ర్ వైవివి జ‌తిన్ మోహాన్

మ్యూజిక్: ప‌వ‌న్

ఎడిట‌ర్: శ్ర‌వ‌న్ క‌టికనేని

ఆర్ట్: దండు రెంజీవ్

పిఆర్‌ఓ: జియ‌స్ కె మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: వెంక‌ట సిద్దారెడ్డి

స‌మ‌ర్స‌ణ: మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి

నిర్మాత‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జ‌యంత్ గాలి.

Advertisement

Love Life and Pakodi Movie first Look Released:

Love Life and Pakodi Movie first Look Out

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement