Advertisement

వైద్యుడిగా మారిన హీరో నిఖిల్ సిద్దార్థ్

Tue 02nd Jun 2020 02:41 PM
nikhil,doctor,karthikeya 2,chandoo mondeti,karthikeya,birthday boy  వైద్యుడిగా మారిన హీరో నిఖిల్ సిద్దార్థ్
Nikhil turns Doctor for Karthikeya 2 వైద్యుడిగా మారిన హీరో నిఖిల్ సిద్దార్థ్
Advertisement

వైవిధ్యమైన సినిమాలతో యంగ్ హీరో నిఖిల్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. నిఖిల్ ఎంచుకునే కథ, కథనాలే కాదు వాటిల్లో పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇక నిఖిల్ - డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయకి ఇటీవలే సీక్వెల్ పనులు మొదలు అయ్యాయి. కార్తికేయ 2 టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో నిఖిల్ డాక్టర్‌గా నటిస్తున్నాడు. కార్తికేయ లో మెడికల్ స్టూడెంట్ గా నటించిన నిఖిల్ ఇప్పుడు ఈ సీక్వెల్ లో డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పేసారు కార్తికేయ 2 చిత్ర బృందం. 

నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ 2 చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో నిఖిల్ మేడలో స్టేథస్ స్కోప్ ఉంది. అలానే వైద్యో నారాయణో హరి - వైద్యుడే నారాయణుడు - నారాయణుడే వైద్యుడు అని ఒక శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా ఈ పోస్టర్ లో పెట్టారు..!  ఐతే ఇదే పోస్టర్ తో కరోనా తో యుద్ధం చేస్తున్న వైద్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ చందు మొండేటి మరియు చిత్ర బృందం.

Nikhil turns Doctor for Karthikeya 2:

Nikhil Role in Karthikeya 2 movie out

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement