హీరోయిన్ అవ్వాలనేది బాల్యం నుంచి డ్రీమ్ అంట!

Mon 01st Jun 2020 04:30 PM
nidhi agarwal,childhood,heroine,dream,heroine nidhi agarwal,chit chat  హీరోయిన్ అవ్వాలనేది బాల్యం నుంచి డ్రీమ్ అంట!
Nidhi Agarwal Chit Chat Highlights హీరోయిన్ అవ్వాలనేది బాల్యం నుంచి డ్రీమ్ అంట!
Sponsored links

చాలామంది హీరోయిన్స్ మీరు హీరోయిన్ కాకపోయి ఉండే ఏమయ్యేవారు అని అడిగితే.. ఏ డాక్టర్ అనో.. ఏ ఇంజినీర్ అనో, ఏ ఫ్యాషన్ డిజైనర్ అనో చెబుతారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం చిన్నప్పటినుండి సినిమాల్లోకి రావాలి, హీరోయిన్ అవ్వాలి అని కలలు కనిందట. ఆమె ఎవరో కాదు తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లలో నటించిన హాట్ గర్ల్ నిధి అగర్వాల్. కరోనా లాక్‌డౌన్ తో ఫ్రీగా ఉన్న నిధి అగర్వాల్ తన పర్సనల్ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంది. నిధి అగర్వాల్ దృష్టిలో అందం అంటే సింపుల్ గా కనిపించడమే అంటుంది. ఎక్కువగా మేకప్ వేసుకుని తిరగను, చాల తక్కువ మేకప్ తోనే ఉంటాను. డాక్టర్స్ ని సంప్రదించే లోషన్స్, క్రీములు వాడతాను అంటుంది.

ఇక చిన్నప్పుడు సినిమా చూసినప్పుడే హీరోయిన్ గా అవ్వాలని అనుకున్నా అని, అప్పటినుండి సినిమాల్లోకి రావాలని కలలు కన్నా అని అందుకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టా అని..ఏలాంటి సినీ నేపథ్యం లేని దాన్ని ఇలా హీరోయిన్ అయ్యా అంటుంది. ఇక ఆరోగ్యంగా ఉండేందుకు మంచి నీళ్లు ఎక్కువగా తాగడమే కాదు.. శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు సి విటమిన్ ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకుకుంటాను అని చెబుతుంది. ఫస్ట్ నుండి నేను శాఖాహారినే అందుకే.. ముందు నుండి కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తింటాను. అలాగే ఉదయం ఇడ్లి తింటాను. మధ్యాహ్నం లంచ్‌లో రైస్ తింటాను. అంతేకాకుండా రోజూ వర్కౌట్స్ చేస్తాను.. లేదంటే బరువు పెరిగిపోతాను. ఇక లాక్ డౌన్ టైం లో షూటింగ్స్ లేక బోర్ కొడుతోంది. అందుకే పబ్జీ గేమ్ ఆడుతున్నా అంటుంది నిధి అగర్వాల్.

Sponsored links

Nidhi Agarwal Chit Chat Highlights:

That the Dream from my childhood Says Nidhi Agarwal

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019