సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి అశోక్ గల్లా ట్రీట్..!

Mon 01st Jun 2020 03:50 PM
ashok galla,perfect birthday gift,superstar krishna fans,yamaleela song,nidhi agarwal  సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి అశోక్ గల్లా ట్రీట్..!
Ashok Galla Perfect Birthday Gift To Superstar Krishna Fans సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి అశోక్ గల్లా ట్రీట్..!
Sponsored links

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆదివారం (మే 31) సినిమా నిర్మాత‌లు ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. నిజానికి అది ‘య‌మ‌లీల’ చిత్రంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ చేసిన సూప‌ర్ హిట్ సాంగ్ ‘జుంబారే’కు రీమిక్స్‌. లెజండ‌రీ అయిన తాత‌య్య‌ను ఆ పాట‌లో అశోక్ గ‌ల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆక‌ట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్.. పాట‌కు స‌రిగ్గా స‌రిపోయాయి. ఆ పాట‌లో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ సైతం మెర‌వ‌డంతో ఈ ప్ర‌త్యేక‌మైన రోజు సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు ప‌ర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన‌ట్ల‌యింది.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ 50 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Click Here for Song

తారాగ‌ణం:

అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య‌

సాంకేతిక బృందం:

డైలాగ్స్‌: క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌. ఠాగూర్‌

మ్యూజిక్‌: జిబ్రాన్‌

సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, సమీర్ రెడ్డి

ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి

ఆర్ట్‌: ఎ. రామాంజ‌నేయులు

పీఆర్వో: బి.ఎ. రాజు, వంశీ-శేఖ‌ర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చ‌ంద్రశేఖ‌ర్ రావిపాటి

నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లా

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌రామ్ ఆదిత్య టి.

బ్యాన‌ర్‌: అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

Sponsored links

Ashok Galla Perfect Birthday Gift To Superstar Krishna Fans:

Ashok Galla Film song Released on Krishna Bday Special

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019