ఐదవ విడత లాక్డౌన్.. నిర్మాతల్లో కొత్త ఆశలు..

Sun 31st May 2020 02:38 PM
covid19,coronavirus,telugu,telugu film industry  ఐదవ విడత లాక్డౌన్.. నిర్మాతల్లో కొత్త ఆశలు..
5th phase of lockdown.. Prouducers are thinking.. ఐదవ విడత లాక్డౌన్.. నిర్మాతల్లో కొత్త ఆశలు..
Sponsored links

దేశంలో నాలుగవ విడత పూర్తికావొచ్చింది. ఐదవ విడత లాక్డౌన్ లోకి ఎంటర్ కాబోతున్నాం. ఈ ఐదవ విడత లాక్డౌన్ లో దాదాపుగా అన్నీ తెరుచుకోనున్నాయి. జూన్ 8వ తేదీ నుండి హోటళ్ళు, గుళ్ళు తెరుచుకోవచ్చని అనుమతి లభించింది. మొదటి విడత అన్ లాక్ లో భాగంగా ఇవి తెర్చుకోనున్నాయి. అయితే ఇక తెరుచుకోవాల్సింది థియేటర్లు, జిమ్ సెంటర్లు, విద్యాసంస్థలు, స్విమ్మింగ్ ఫూల్స్ మాత్రమే..

అయితే వీటికి కూడా తొందరలోనే అనుమతులు ఇస్తామని అంటున్నారు. ఫేజ్ 3 లో భాగంగా థియేటర్లు తెరుస్తామని ప్రకటించారు. అంటే ఫేజ్ 3 ఆగస్టు నెలలో స్టార్ట్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితులకి అనుగుణంగా ఏమేం ఓపెన్ చేయాలన్న నేపథ్యంలో ఆలోచన చేసి పర్మిషన్స్ ఇవ్వనున్నారు. అయితే ఆగస్టులో థియేటర్లు తెర్చుకుంటాయన్న ఆశాభావం నిర్మాతల్లో కనిపిస్తుంది.

ఒకవేళ ఆగస్టులో సినిమాహాళ్ళు తెర్చుకుంటే దసరా నాటికి మామూలు పరిస్థితికి రావొచ్చు. మొదట్లో ప్రేక్షకులు అంతగా సినిమాలకి రాకపోయినా దసరా వరకి సాధారణ స్థాయికి రానుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల తమ సినిమాలని దసరా రేసులో నిలబెట్టడానికి సిద్ధం చేసుకుంటున్నారు. మరి నిర్మాతల ఆశాభావం నిజమవుతుందా లేదా చూడాలి.

Sponsored links

5th phase of lockdown.. Prouducers are thinking..:

Producers are thinking about cinema release

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019