సస్పెన్స్‌కు తెరదించిన ‘సర్కారు వారి పాట’

Mon 01st Jun 2020 12:20 PM
mahesh babu,title,sarkaru vaari paata,super star,super star krishna  సస్పెన్స్‌కు తెరదించిన ‘సర్కారు వారి పాట’
Sarkaru Vaari Paata Movie Pre Look released సస్పెన్స్‌కు తెరదించిన ‘సర్కారు వారి పాట’
Sponsored links

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. కృష్ణగారి పుట్టిన రోజునాడు మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక ప్రకటన ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ముందునుండి అనుకున్నట్టుగానే మహేష్ బాబు కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ తర్వాత మహేష్ సినిమా ఏమిటనే దాని మీద పిచ్చ ఆసక్తిగా మారింది. కారణం వంశి పైడిపల్లి మూవీ అనుకున్న మహేష్ ఫ్యాన్స్‌కి మహేష్ షాకిచ్చాడు. తర్వాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌తో సినిమా అంటూ ప్రచారం జరగడం, మహేష్ కన్ఫర్మ్ చెయ్యకుండా కన్ఫ్యూజన్‌లో పెట్టడం.. గత వారం రోజులుగా పరశురామ్ - మహేష్ మూవీపై సోషల్ మీడియాలో వార్తలు రావడంతో మహేష్ ఫ్యాన్స్ పిచ్చ క్యూరియాసిటీగా ఉన్నారు.

ఇక మహేష్ ఎప్పటిలాగే తండ్రి కృష్ణ పుట్టిన రోజున ఎమోషనల్‌గా ట్వీట్ చేసి విషెస్ చెప్పడమే కాదు.. తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశాడు. పరశురామ్‌తో మహేష్ ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో సినిమా మొదలెడుతున్నాడు. ముందు నుండి ప్రచారం జరిగినట్టుగానే మహేష్ ‘సర్కారు వారి పాట’ టైటిల్ తో రంగంలోకి దిగిపోయాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అనేది జస్ట్ కనిపించి కనిపించని లుక్ తో టైటిల్ వదిలారు. కాకపోతే మహేష్ తాజాగా లాక్ డౌన్ వర్కౌట్స్ చూస్తే కొత్త లుక్ లోనే కనిపిస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు. బట్ సర్కారు వారి పాట టైటిల్ లో మహేష్ నెక్ బ్యాక్ లుక్ మాత్రం అంతగా అనిపించడం లేదు. చెవికి పోగు, హెయిర్ స్టయిల్ అన్ని కొత్తగా కనిపిస్తున్నప్పటికీ..  మహేష్ లుక్ పూర్తిగా రివీల్ అయినా ఎక్కడో తేడా కొడుతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. మరి మహేష్ ‘సర్కారు వారి పాట’ పూర్తి లుక్ వచ్చాక దాని మీద డిస్కర్షన్ పెడదాం.

Sponsored links

Sarkaru Vaari Paata Movie Pre Look released:

Mahesh babu Next Film Title Sarkaru Vaari Paata Announced

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019