రాజమౌళితో మహేష్ సినిమా.. మహేష్ నోరు విప్పుతాడా..?

Sat 30th May 2020 03:27 PM
askssmb,ssmb27,parashuram,rajamouli,sarkari vaari paata  రాజమౌళితో మహేష్ సినిమా.. మహేష్ నోరు విప్పుతాడా..?
Will mahesh say something about Rajamouli..? రాజమౌళితో మహేష్ సినిమా.. మహేష్ నోరు విప్పుతాడా..?
Sponsored links

సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి చిత్రం గురించి రేపు ఉదయం 9గంటల 9నిమిషాలకి అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ సర్కారి వారి పాట అని రెండురోజుల క్రితమే బయటకి వచ్చింది. ప్రస్తుతం రిలీజ్ చేసిన ప్రీ అనౌన్సుమెంట్ చూస్తే ఈ టైటిల్ కన్ఫర్మ్ అయ్యేలాగే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ బాబు అభిమానులతో ముచ్చటించనున్నాడు.

సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులని తమ ప్రశ్నల్ని షూట్ చేయండని కోరుతున్నాడు. రేపు సాయంత్రం 5 గంటలకి మహేష్, అభిమానుల ప్రశ్నలకి సమాధానం ఇవ్వనున్నాడు. అయితే ఇక్కడ మహేష్ ఎలాంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తాడనేది ఆసక్తిగా మారింది. మితభాషి అయిన మహేష్ ఎక్కువగా మాట్లాడడు. అదీగాక అభిమానులతో సోషల్ మీడియా ద్వారా మాట్లాడడం చాలా అరుదు.

దాంతో మహేష్ కి ఎలాంటి ప్రశ్నలు వేయాలో ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నారు. అయితే అందరికీ ఆసక్తి కలిగించే ఒకే ఒక్క అంశం రాజమౌళితో సినిమా. రాజమౌళి మహేష్ తో సినిమా ఉంటుందని చెప్పాడు కానీ, మహేష్ సైడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరి రేపు అభిమానులు అడిగే ప్రశ్నలకి ఇచ్చే సమాధానంతోనైనా రాజమౌళితో సినిమా గురించి ఏదైనా చెప్తాడేమో అని అనుకుంటున్నారు. 

Sponsored links

Will mahesh say something about Rajamouli..?:

Will Mahesh say about about Rajamouli

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019