మళయాల చిత్ర రీమేక్ లో అన్నదమ్ములు..?

Brothers going to share screen with Malayalam remake..?

Thu 28th May 2020 03:35 PM
Advertisement
surya,karthi,ayyappanum koshiyum,pruthviraj,biju menon  మళయాల చిత్ర రీమేక్ లో అన్నదమ్ములు..?
Brothers going to share screen with Malayalam remake..? మళయాల చిత్ర రీమేక్ లో అన్నదమ్ములు..?
Advertisement

తమిళ నటుడు సూర్య తెలుగు వారందరికీ సుపరిచితుడే. గజిని సినిమాతో తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ని ఏర్పర్చుకున్నాడు. సూర్య తర్వాత తన తమ్ముడు కార్తి కూడా సినిమాల్లోకి వచ్చాడు. ఆవారా, యుగానికి ఒక్కడు సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయమై ఊపిరి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించాడు. అయితే అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక్క సినిమా చేయలేదు.

ప్రస్తుతం ఆ కోరిక కూడా తీరబోతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. మళయాలంలో సూపర్ హిట్ అనిపించుకున్న అయ్యప్పనుం కోషియం అనే సినిమా తమిళ రీమేక్ లో వీరిద్దరూ కలిసి నటిచబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అభిమానులకి పండగే అని చెప్పాలి. అన్నదమ్ములిద్దరినీ ఒకే తెరపై, అదీ అయ్యప్పనుం కోషియం వంటి సినిమా ద్వారా కనిపిస్తే ఎంతో ఉత్సాహంగా ఫీల్ అవుతారు.

ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రానప్పటికీ, అభిమానులు ఈ వార్త నిజమైతే బాగుండునని కోరుకుంటున్నారు. అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ హక్కులని సితార ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకోగా, హిందీ హక్కులని జాన్ అబ్రహం ప్రొడక్షన్ బ్యానర్ జేఏ ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది.

Advertisement

Brothers going to share screen with Malayalam remake..?:

Brothers going share a screen with Malayalam remake

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement