ప్రభాస్ నిర్మాతలని భయపెట్టేస్తున్న ఫ్యాన్స్!!

Tue 26th May 2020 12:02 PM
prabhas,fans,angry,oh dear,first look,uv creations,movie title,prabhas 20  ప్రభాస్ నిర్మాతలని భయపెట్టేస్తున్న ఫ్యాన్స్!!
Prabhas Fans Angry on UV Creations Banner ప్రభాస్ నిర్మాతలని భయపెట్టేస్తున్న ఫ్యాన్స్!!
Sponsored links

ఫ్యాన్స్ తమ హీరోల సినిమాల లుక్స్ పైన టీజర్స్ పైన విపరీతమైన అంచనాలతో ఉంటారు. పండగలకి, పబ్బాలకి హీరోల పుట్టిన రోజుల కోసం ఆయా హీరోల ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తారు. అదే సమయంలో దర్శకులు, నిర్మాతలు హీరోల సినిమాల లుక్స్ గనక టెక్నీకల్ రీజన్స్‌తో విడుదల వాయిదా వేసారా ఇక అంతే. ఫ్యాన్స్ డిస్పాయింట్ అవడమే కాదు... సోషల్ మీడియాలో గోల గోల చేస్తారు. తాజాగా ఎన్టీఆర్ ఫాన్స్ RRR లుక్ కోసం ఎదురు చూసి దెబ్బతిన్నారు. ఇక మొన్నామధ్యన ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ 20 లుక్ అండ్ టైటిల్ కోసం ఇలానే ఎదురు చూసి యువీ క్రియేషన్స్ మీద ఆగ్రహంతో ఊగిపోయారు.

ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ మొదలై ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకు ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ పోస్టర్ కానీ ఏది వదలకుండా తాత్సారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యువీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కత్తికట్టారు. అయితే యువీ వారు మాత్రం ప్రభాస్ 20 సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చెయ్యాల్సి ఉందట. షూటింగ్ పార్ట్‌లో మిగిలిన కీలక సన్నివేశాల నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచనట. అంతేకాకుండా ఈ మూవీ కథపై ఎటువంటి అంచనాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న టీం కొంచెం లేటైనా బెస్ట్ అవుట్ ఫుట్ తో రావాలని వెయిట్ చేస్తున్నారట. మరి గతంలో బాహుబలి క్రేజ్ తో సాహో పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు రావడం.. ఆ అంచనాలు అందుకోలేక సాహో చేతులెత్తేసింది. ఈసారి అలా లేకుండా సినిమాపై అంత అంచనాలు పెరగకుండా యువీ వారు ఎత్తులు వేస్తున్నటుగా టాక్.

Sponsored links

Prabhas Fans Angry on UV Creations Banner:

Worst Banner UV Creations: Prabhas Fans Ugly Act Again

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019