హమ్మయ్య.. హీరో ఇండియా వచ్చేశాడు..

Fri 22nd May 2020 04:57 PM
pruthvi raj,malayalam,covid19,coronavirus   హమ్మయ్య.. హీరో ఇండియా వచ్చేశాడు..
He is back to india.. హమ్మయ్య.. హీరో ఇండియా వచ్చేశాడు..
Sponsored links

 

లాక్డౌన్ కారణంగా చాలా మంది వేరే ఊళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కరోనా ఉధృతిని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ ని పెట్టడంతో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది అవస్థలు పడ్డారు. ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా ఇబ్బంది పడ్డ వారిలో మళయాల స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు.

మళయాల హీరో పృథ్వీరాజ్ లాక్డౌన్ కారణంగా జోర్డాన్ లోనే ఉండిపోయాడు. సినిమా షూటింగ్ నిమిత్తమై జోర్డాన్ వెళ్ళిన చిత్ర బృందం అక్కడే లాక్ అయిపోయారు. దాంతో రెండు నెలలపాటు అక్కడే ఉండి తీవ్ర ఇబ్బందులని ఎదుర్కొన్నారు. తినడానికి తిండి లేక అవస్థలు పడ్డారట. ఆ విషయాలని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. తమని అక్కడి నుండీ ఇండియాకి తీసుకురావాలని లేఖలు రాసాడు.

అయితే ఎట్టకేలకు పృథ్వీరాజ్ ఈ రోజు ఇండియా చేరుకున్నాడు. పృథ్వీరాజ్ సహా చిత్రబృందం మొత్తాన్ని ప్రత్యేక విమానంలో ఇండియా తీసుకొచ్చారు. దీంతో ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారు.

Sponsored links

He is back to india..:

Pruthvi raj back to india

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019