ప్రశాంత్ నీల్ భలే ఇరుక్కున్నాడుగా..!!

Sat 23rd May 2020 06:55 PM
jr ntr,prashanth neel,welcome,hate,kannada people,jr ntr fans  ప్రశాంత్ నీల్ భలే ఇరుక్కున్నాడుగా..!!
Kannada People Fire on NTR and Prashant’s Film? ప్రశాంత్ నీల్ భలే ఇరుక్కున్నాడుగా..!!
Sponsored links

కన్నడలో యష్ హీరోగా తెరకెక్కించిన కెజిఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో... ఆ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తో పాటుగా హీరో యష్ లు ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్స్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమా హిట్ అయ్యాక చాలామంది హీరోల చూపు దర్శకుడు ప్రశాంత్ నీల్ పై పడింది అనేకన్నా ప్రశాంత్ నీల్ వేరే భాషల హీరోలతో సినిమా చేసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపించాడు అనడం కరెక్ట్. ఒకపక్క ప్రశాంత్ నీల్ యష్ తో కెజిఎఫ్ 2 చేస్తూనే టాలీవుడ్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ తో మీటింగ్స్ పెట్టాడు. వాళ్ళకి స్టోరీ లైన్స్ వినిపించాడు. అందరిలో ఎన్టీఆర్ ఎక్కువగా ప్రశాంత్ నీల్ కి కనెక్ట్ అయ్యి యష్ తో పాటుగా, ప్రశాంత్ నీల్ కి పార్టీ ఇచ్చాడనే టాక్ నడిచింది.

అయితే తాజాగా ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ ఒకే అయినట్లుగా పాన్ ఇండియా టాక్. ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ బర్త్ డే విషెస్ చెప్పడంతో అది కాస్త కన్ఫర్మ్ అవడంతో.. ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ పై కత్తి కట్టారు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు కన్నడని వదిలేసి వేరే భాషల హీరోలతో సినిమా చెయ్యడం కన్నడీగులకు బొత్తిగా నచ్చడం లేదు. రాజమౌళి, సుకుమార్, శంకర్ లాంటి దర్శకులు ఎంతగా పాపులర్ అయ్యినప్పటికీ... తమ భాష హీరోలతో తప్ప ఇతర భాషల హీరోలను పట్టుకోవడం లేదు.

కానీ ప్రశాంత్ నీల్ కి కన్నడ పరిశ్రమ గుర్తింపు తెచ్చిపెడితే.. ఇప్పుడు భారీ పారితోషకాలకు ఆశపడి ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నాడు అంటూ ఎగిరిపడుతున్నారు. వారికి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అస్సలిష్టం లేదు. కన్నడని వాడుకుని గతంలోనూ హీరోయిన్ రష్మిక టాలీవుడ్ లో క్రేజ్ చూసి కన్నడ వదిలేసిందిగాని, తాజాగా ప్రశాంత్ నీల్ అలానే చేస్తాడని గెటౌట్ ప్రశాంత్ నీల్ అంటూ హాష్ ట్యాగ్ తో కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే.. తెలుగు ప్రేక్షకులు, ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం వెల్కమ్ టు టీఎఫ్ఐ ప్రశాంత్ నీల్ హాష్ ట్యాగ్ తో సోషల్ ఇండియాలో హల్చల్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ తో మూవీ అని ప్రశాంత్ నీల్ అలా బుక్ అయ్యాడన్నమాట.

Sponsored links

Kannada People Fire on NTR and Prashant’s Film?:

Jr ntr Fans Welcoms Director Prashant neel

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019