టాలీవుడ్‌కు శుభవార్త.. మరికొద్ది రోజుల్లో షూటింగ్స్!

Fri 22nd May 2020 03:41 PM
kcr,chiranjeevi,telugu film industry,rajamouli,talasani srinivas yadav,nagarjuna  టాలీవుడ్‌కు  శుభవార్త.. మరికొద్ది రోజుల్లో షూటింగ్స్!
Good news for Telugu Film Industry టాలీవుడ్‌కు శుభవార్త.. మరికొద్ది రోజుల్లో షూటింగ్స్!
Sponsored links

కరోనా కారణంగా నాలుగవ విడత లాక్డౌన్ పాటిస్తున్న దేశంలో కొన్ని మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ పనులు చేసుకోవచ్చని కొన్ని వ్యాపార సంస్థలకి అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగుల పర్మిషన్స్ కోసం నేడు సినీ పెద్దలంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలుసుకున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, ఇంకా పలువురు కేసీఆర్ తో చర్చించారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్, మరికొద్ది రోజుల్లో షూటింగ్ జరుపుకోవచ్చనే హామీ ఇచ్చారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాతో పాటు టెలివిజన్ కి సంబంధించిన అన్ని షూటింగులకి అనుమతి లభించనుంది. షూటింగుల్లో పాటించే జాగ్రత్తలతో పాటు ఇంకా అనేక నియమ నిబంధనలతో కూడిన లిస్ట్ రూపొందగానే షూటింగులకి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో టాలీవుడ్ కి మంచి రోజులు రానున్నాయని అర్థ అవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే.

Sponsored links

Good news for Telugu Film Industry:

Good news for Telugu Film Industry

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019