నాగ‌శౌర్య కెరీర్‌లోనే అత్య‌ధిక టీఆర్పీ ఈ చిత్రానికే..

Sat 23rd May 2020 11:16 AM
naga shaurya,all time record,tv,ashwathama,trp rating  నాగ‌శౌర్య కెరీర్‌లోనే అత్య‌ధిక టీఆర్పీ ఈ చిత్రానికే..
Huge TRP For Naga Shaurya Ashwathama Movie నాగ‌శౌర్య కెరీర్‌లోనే అత్య‌ధిక టీఆర్పీ ఈ చిత్రానికే..
Sponsored links

నాగ‌శౌర్య కెరీర్‌లోనే అత్య‌ధిక టీఆర్పీ సాధించిన ‘అశ్వ‌థ్థామ‌’

నాగ‌శౌర్య హీరోగా న‌టించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘అశ్వ‌థ్థామ‌’ వెండితెర‌పైనే కాకుండా, చిన్నితెర‌పైన కూడా ఆడియెన్స్‌ను అల‌రించింది. నాగ‌శౌర్య కెరీర్‌లోనే అత్య‌ధిక టీఆర్పీ సాధించిన సినిమాగా నిలిచింది. జెమినీ టీవీలో ప్ర‌సార‌మైన ఈ సినిమా 9.10 టీఆర్పీని సాధించడం విశేషం. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట‌ర్ల‌లో 2020 జ‌న‌వ‌రి 31న విడుద‌లై నాగ‌శౌర్య సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు టెలివిజ‌న్‌లోనూ అదే హ‌వా కొన‌సాగిస్తూ మే 15న తొలిసారి జెమినీ టీవీలో ప్ర‌సారమై సూప‌ర్ హిట్ట‌యింది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఉష ముల్పూరి మాట్లాడుతూ, టెలివిజ‌న్ తెర‌పై ‘అశ్వ‌థ్థామ’ మూవీ ఇంత‌గా ఆద‌ర‌ణ పొంద‌డం చాలా ఆనందాన్ని క‌లిగించింద‌నీ, ఇందుకు కార‌ణ‌మైన తెలుగు టీవీ వీక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నామ‌నీ అన్నారు. కంటెంట్‌ను న‌మ్ముకొని చ‌క్క‌ని యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా అశ్వ‌థ్థామ‌ను నిర్మించామ‌నీ, నాగ‌శౌర్య ప‌ర్ఫార్మెన్స్‌, యాక్ష‌న్‌ను అంద‌రూ ప్ర‌శంసించ‌డం ఆనందాన్ని ఇస్తోంద‌ని చెప్పారు. అలాగే ఈ సినిమా ఇంత ఆక‌ర్ష‌ణీయంగా రావ‌డానికి ర‌మ‌ణ‌తేజ డైరెక్ష‌న్ కూడా కార‌ణ‌మ‌న్నారు.

Sponsored links

Huge TRP For Naga Shaurya Ashwathama Movie:

Naga Shaurya All-Time Record On TV With Ashwathama

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019