డైరెక్టర్ మారుతి క్లారిటీ సరిపోతుందా?

Thu 09th Apr 2020 04:34 PM
director maruthi,prathi roju pandage,maruthi director,clarity,next project  డైరెక్టర్ మారుతి క్లారిటీ సరిపోతుందా?
Director Maruthi gives clarity on his next film డైరెక్టర్ మారుతి క్లారిటీ సరిపోతుందా?
Sponsored links

‘ప్రతిరోజూ పండగే’ సినిమా హిట్ తర్వాత డైరెక్టర్ మారుతి ఆ హీరోకి మూవీ చేస్తున్నాడు.. ఈ హీరోతో ఫిక్స్ అయ్యాడంటూ వార్తలొస్తున్నాయి. రవితేజ దగ్గరనుండి రామ్ వరకు మారుతీ సినిమా చేస్తున్నాడంటూ.. వార్తలు రావడమే కానీ.. అటు హీరోలు కానీ ఇటు మారుతీ కానీ కన్ఫర్మ్ చెయ్యలేదు. తాజాగా రెడ్ సినిమా తర్వాత రామ్ మారుతీ‌తో సినిమా చేస్తున్నాడట అని.. అయితే మాస్ కాకుండా ఫ్యామిలీ స్టోరీతో కథ రాయమని రామ్ మారుతీ కి చెప్పినట్టుగా వార్తాలొచ్చాయి. రెండు మాస్ సినిమాలు తర్వాత ఓ క్లాస్, కుటుంబ కథ చిత్రం చేద్దామని మారుతీ‌తో రామ్ చెప్పినట్టుగా అన్నారు.

అయితే తాజాగా మారుతీ మాత్రం నేనే హీరోకి కమిట్ అవ్వలేదు అంటున్నాడు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తర్వాత నేను ఏ హీరోకి కథ వినిపించలేదని, నేను కథని ప్రిపేర్ చేస్తూ స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, అన్నీ పూర్త‌య్యాక తానే హీరో ఎవ‌ర‌న్న‌ది చెబుతాన‌ని.. ఈ న్యూస్ మాత్రమే నిజమని.. నా నెక్స్ట్ సినిమాపై నేను చెప్పే వరకు ఎలాంటి న్యూస్ నమ్మొద్దు అంటూ.. చెబుతున్నాడు. మరి మారుతీ మైండ్‌లో ఏ హీరో లేకుండానే మారుతీ కథ రాసుకున్నాడా.. లేదంటే కథని బట్టి హీరోని సెట్ చేసుకుంటాడా అనేది చూడాలి.

Sponsored links

Director Maruthi gives clarity on his next film:

I am not comitted any Hero..says director maruthi

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019