లెక్కల మాస్టర్ మళ్లీ ఏదో మాయ చేస్తున్నాడు

Thu 09th Apr 2020 06:23 PM
pushpa,craze,allu arjun,sukumar,mass look,sukumar movies  లెక్కల మాస్టర్ మళ్లీ ఏదో మాయ చేస్తున్నాడు
Superb response to Allu Arjun and Sukumar Pushpa title లెక్కల మాస్టర్ మళ్లీ ఏదో మాయ చేస్తున్నాడు
Sponsored links

సుకుమార్ సినిమాలు అర్థం కావాలంటే దానికి తెలివిగల బుర్ర ఉండాలి అంటారు. లెక్కల మాస్టర్ కదా లెక్కలు ఉన్నట్టుగా ఉంటాయి ఆయన సినిమాలు. తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ తో తెరకెక్కుతున్న పుష్ప సినిమా బ్యాగ్డ్రాప్ ఎర్ర చందనం స్మగ్లింగ్ మీదే సినిమా నడుస్తుంది. దానికి తగ్గట్టుగా బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్‌గా మాస్‌గా కనబడతాడనే న్యూస్ ఉండడమే కాదు.. సుకుమార్ పుష్ప ఫస్ట్ లుక్ లోనే బన్నీ ని ఊర మాస్ గా చూపించాడు.

అయితే ఓ లుక్ లో బన్నీ ని చూస్తే లారీ డ్రైవర్ అనిపిస్తుంది. మరో లుక్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసివాడిగా పోలీస్ స్టేషన్ లో కనబడుతున్నాడు. మరి లారీ డ్రైవర్ ఆ... లేదంటే స్మగ్లరా.. ఈ రెండింటికి మధ్యన ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది. దీన్ని బట్టి ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ పాత్ర కూడా డిఫరెంట్ షేడ్స్ మరియు ఊహించని ట్విస్ట్ లు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ టాలీవుడ్ కోలీవుడ్, కన్నడ మళయాలానికి బాగా రీచ్ అయ్యింది కానీ.. హిందీలో అల్లు అర్జున్ మూవీ క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి. మాములుగా అయితే అల్లు అర్జున్ కి బాలీవుడ్ యూట్యూబ్‌లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. మరి పుష్ప డైరెక్ట్ కదా.. ఎలా ఉంటుందో చూడాలి.

Sponsored links

Superb response to Allu Arjun and Sukumar Pushpa title:

Pushpa title creates sensation in Social media

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019