కొరటాలపై బన్నీ కన్ను పడింది!

Thu 09th Apr 2020 08:21 AM
bunny,allu arjun,koratala shiva,acharya,icon,bunny-koratala   కొరటాలపై బన్నీ కన్ను పడింది!
Bunny Eye On Koratala Shiva! కొరటాలపై బన్నీ కన్ను పడింది!
Sponsored links

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. ఇప్పుడు మాంచి ఊపు మీదున్నాడు. ‘అల వైకుంఠపురములో..’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో ఒక్కసారిగా ఆయన రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆయనతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతేకాదు.. అప్పుడెప్పుడో మూలపడిన సినిమాలు సైతం మళ్లీ తెరపైకి వస్తున్నాయ్. బన్నీ పుట్టినరోజున అనగా ఏప్రిల్-08న మెగాభిమానులకు ‘పుష్ప’ను సుకుమార్ గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం విదితమే. అంతేకాదు.. మరోవైపు ‘ఐకాన్’ సినిమా కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక బన్నీ ఏం చేయబోతున్నాడు..? ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌ అయ్యింది.

తాజాగా టాలీవుడ్‌లో.. సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన కొరటాల శివపై బన్నీ కన్నుపడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి బన్నీ సినీ కెరీర్ విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తుంటాడు. ఏ డైరెక్టర్‌తో సినిమా తీస్తే హిట్టవుతుంది..? ఏ టైమ్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలి..? ఇలాంటి విషయంలో ముందుచూపుతో ఉంటాడు. ఇందులో భాగంగా ఆ రెండు సినిమాలు అయ్యాక కొరాటలతో సినిమా తీయాలని బన్నీ భావిస్తున్నాడట. 

అంతేకాదు కొరటాల రెడీ అంటే ‘పుష్ప’ తర్వాత ఈ ఆయనతో చేయడానికి కూడా సిద్ధమేనని సంకేతాలు పంపాడట. ప్రస్తుతం మెగాస్టార్ చిరుతో ‘ఆచార్య’ సినిమాతో బిజిబిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేస్తాడనే విషయం సస్పెన్స్‌గానే ఉంది. ఇటీవలే మరో రెండేళ్ల పాటు మెగా కాంపౌండ్‌లో కొరటాల ఉంటాడని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బన్నీతో సినిమాలు ఉంటాయని వార్తలు వినిపించిన విషయం విదితమే. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.

Sponsored links

Bunny Eye On Koratala Shiva!:

Bunny Eye On Koratala Shiva!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019