Advertisementt

‘కార్తీకేయ 2’ కోసం సిక్స్ ప్యాక్‌లో నిఖిల్

Sun 05th Apr 2020 12:18 PM
karthikeya 2,nikhil,six pack,hero nikhil siddharth,karthikeya 2 movie  ‘కార్తీకేయ 2’ కోసం సిక్స్ ప్యాక్‌లో నిఖిల్
Hero Nikhil Six Pack for Karthikeya 2 ‘కార్తీకేయ 2’ కోసం సిక్స్ ప్యాక్‌లో నిఖిల్
Advertisement
Ads by CJ

యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2. వ‌రుస హిట్ సినిమాలు రూపొందిస్తున్న పిపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు పై విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ కి సంబంధించిన టైటిల్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ కి ఇప్ప‌టికే అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఇటీవ‌లే శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంకటేశ్వ‌రుని స‌న్నిధిలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిణామాల రీత్యా కార్తీకేయ 2 బృందం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. హీరో నిఖిల్ త‌న కెరీర్ లో తొలిసారిగా కార్తీకేయ 2 లో సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించ‌బోతున్నారు. 

ఇప్ప‌టికే నిఖిల్ సిక్స్ ప్యాక్ షేప్ కోసం కావాల్సిన తీవ్ర క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన సెల్పీ ఫోటో త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు నిఖిల్. మ‌రో నాలుగు వారాల్లో ఫుల్ సిక్స్ ప్యాక్ లుక్ క‌నిపించ‌బోతున్న‌ట్లుగా నిఖిల్ ట్విట్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారిక‌గా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది.

Hero Nikhil Six Pack for Karthikeya 2:

Karthikeya 2 Movie Latest Update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ