కెరీర్ పీక్స్ లో ఉండగా కీర్తి పెళ్ళి చేసుకుంటుందా..?

Sat 04th Apr 2020 04:51 AM
keerthy suresh,mahanati,nithin,rang de  కెరీర్ పీక్స్ లో ఉండగా కీర్తి పెళ్ళి చేసుకుంటుందా..?
Rumours about keerthy suresh marriage కెరీర్ పీక్స్ లో ఉండగా కీర్తి పెళ్ళి చేసుకుంటుందా..?
Sponsored links

మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని దక్కించుకుని ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన కీర్తి పెళ్ళి చేసుకోబోతుందన్న వార్తలు జోరందుకున్నాయి. ప్రస్తుతం హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కీర్తి పెళ్ళి వార్తలు రావడం ఆమె అభిమానులకి షాకింగే.. కేరళలోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో ఆమె వివాహం జరగనుందని.. వారి కుటుంబానికి కీర్తి కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని అన్నారు.

ఆ సన్నిహిత సంబంధంతోనే వారిరువురు కుటుంబాలు కలిసి కీర్తి పెళ్ళిని ఓకే చేసారని ఇక త్వరలోనే ఆమె పెళ్ళి జరగనుందని వార్తలు చెలరేగాయి. అయితే ఈ వార్తలని కీర్తి సురేష్ ఫ్యామిలీ కొట్టిపారేసింది. కీర్తికి ఇప్పుడప్పుడే పెళ్ళి చేసే ఆలోచన లేదని, ప్రస్తుతం సినిమాల్లో ఆమె బిజీగా ఉందని.. అందువల్ల ఇలాంటి టైమ్ లో పెళ్ళి చేయబోవట్లేదని.. ఏదైనా అలోచిస్తే తామే చెబుతామని.. ఇలా సోషల్ మీడియాలో వచ్చే వార్తలని నమ్మవద్దని కోరారు.

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్న కీర్తి ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం మిస్ ఇండియా అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్న కీర్తి తెలుగులో నితిన్ సరసన రంగ్ దే చిత్రంలో కనిపిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Sponsored links

Rumours about keerthy suresh marriage:

rumours about keerthy suresh marriage

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019