‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన ‘సరిలేరు’

Fri 03rd Apr 2020 07:29 AM
mahesh babu,prabhas bahubali,mahesh sarileru neekevvaru,bahubali records,trp  ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన ‘సరిలేరు’
Mahesh Babu’s Sarileru Neekevvaru Break Bahubali Records ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన ‘సరిలేరు’
Sponsored links

టైటిల్ చూడగానే ఇదేంటి..? అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా రికార్డ్స్‌ను ‘సరిలేరు నీకెవ్వరు’ బ్రేక్ చేసిందంటే నమ్మశక్యంగా లేదు కదూ.. అవునండోయ్ బాబూ.. ఇది థియేటర్స్ పరంగా.. మరీ ముఖ్యంగా కలెక్షన్ల పరంగా కానే కాదు.. టెలివిజన్ వ్యూవర్ షిప్ (టీఆర్పీ) పరంగా అంతే. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి ఇక లేటెందుకు.

అప్పుడు బన్నీతో..!

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు, యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరుగాంచిన అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు తొలి ఆట నుంచి కలెక్షన్ల సునామీనే కురిసింది. అయితే.. మరోవైపు ఈ సినిమాకు పోటీగా వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో..’ సైతం గట్టిగానే కలెక్షన్లు రాబట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు సినిమాలు షూటింగ్‌లు మొదలుకుని ఫంక్షన్స్, సాంగ్స్ రిలీజ్, సినిమా రిలీజ్ ఇలా ప్రతి విషయంలోనూ పోటీ పడ్డాయ్. అయితే ఎవరికెంత కలెక్షన్స్ వచ్చాయో ఇప్పటికీ ఎవరూ క్లారిటీ చెప్పట్లేదు.

తెగ చూసేశారుగా..!

ఇక అసలు విషయానికొస్తే.. ‘సరిలేరు’ సినిమాతో మహేశ్ పేరు మరోసారి మార్మోగింది. అంతేకాదు.. మహేశ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘సరిలేరు’ నిలిచిపోయింది. ‘సరిలేరు’ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఉగాది పర్వదినాన టెలివిజన్ ప్రీమియర్‌గా మార్చి 25న జెమినీ టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అందరూ ఇళ్లలో ఉండటం.. పైగా మహేశ్ సినిమా కావడంతో తెగ చూసేశారు. దీంతో ఒక్కసారిగా టీఆర్పీని సొంతం చేసుకుని సంచలన రికార్డ్‌ను నమోదు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. 

ఇప్పుడు బాహుబలితో.. లెక్కలు ఇలా..!

ఇదంతా ఒక ఎత్తయితే బుల్లితెరపై ఇప్పటి వరకూ ఉన్న ‘బాహుబలి’ రికార్డ్‌ను కూడా ఈ చిత్రం బీట్ చేయడం సినిమా యూనిట్‌కు.. ఫ్యాన్స్‌కు మంచి కిక్కించే విషయం. కాగా.. ఇప్పటివరకూ 22.70 టీఆర్పీతో ‘బాహుబలి-2’ అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 23.4 టీఆర్పీని సాధించింది. కాగా.. మొదట బాహుబలి-01 రికార్డ్‌ను ‘బాహుబలి-2 బద్ధలు కొట్టగా.. ఆ రెండు రికార్డ్స్‌ను తిరగరాసి ‘సరిలేరు నాకెవ్వరు’ అని మహేశ్ అనిపించుకున్నాడన్న మాట.

Sponsored links

Mahesh Babu’s Sarileru Neekevvaru Break Bahubali Records:

Mahesh Babu’s Sarileru Neekevvaru Break Bahubali Records  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019