ఇంద్రసేనుడి ఇంద్రభవనాన్ని చూశారా..!?

Fri 03rd Apr 2020 07:57 AM
megastar chiranjeevi,indrasena reddy,indra bhavan,chiru house,mega star house full video  ఇంద్రసేనుడి ఇంద్రభవనాన్ని చూశారా..!?
Megastar Chiranjeevi House Full Video.. ఇంద్రసేనుడి ఇంద్రభవనాన్ని చూశారా..!?
Sponsored links

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇల్లు చూస్తే నిజంగా అభిమానులకు మతిపోతుందేమో.. ఆ రేంజ్‌లో ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇంద్రభవనాన్ని మించిన ఇల్లు అని  అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ ఇల్లు టాపిక్ ఇప్పుడెందుకు వచ్చింది..? అసలు ఈ ఇల్లు ప్రస్తావన తీసుకొచ్చిందెవరు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మెగాస్టార్ ఇల్లుకు సంబంధించి ఇంతవరకూ చిన్నపాటి ఫొటోలో నెట్టింట్లో దర్శనమిచ్చాయ్. ఒకవేళ అభిమానులు చూడటానికి వెళ్లినా మొత్తం చూసే అవకాశం లేదు. అయితే.. తాజాగా ‘ఇదిగో ఇదీ నా ఇల్లు అభిమానులారా చూస్కోండిక’ అంటూ అని మెగాభిమానుల కోసం ఓ వీడియోను చిరు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. నిజంగా ఇల్లు అదుర్స్.. ఆ స్విమ్మింగ్ పూల్ అయితేనేం.. ఆ ఇల్లు లొకేషన్ అయితేనేం..? నిజంగా అద్భుతంగా ఉంది. ఈ ఇంటినే మెగాభిమానులు ఇంద్రభవనంతో పోల్చుకుంటున్నారు. అంతేకాదండోయ్ ఇంద్రభవనాన్ని మించిన ఇల్లు అని మరికొందరు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

సెలబ్రిటీలు అంటే.. ఏ రేంజ్‌లో ఇల్లు కట్టుకుంటారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. చిరు అయితే ఏకంగా.. కొండపై అత్యంత విలాసవంతంగా కట్టుకున్నారు. ఆ వ్యూ అయితే నిజంగా సూపర్‌గా ఉంది. ఈ ఇంటికి సంబంధించి 01:03 నిడివి గల వీడియోలో ఇంద్రసేనుడి ఇంద్రభవనం మొత్తం చూపించేశారు చిరు. ఈ వీడియో వేకువ జామునే వీడియో తీయడంతో సూర్యుడు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో మెగాస్టార్ పంచుకున్నారు. కరోనా నేపథ్యంలో యావత్ భారత్ లాక్‌డౌన్‌లో ఉంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు బంద్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంటిపట్టునే ఉన్న చిరు.. ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటూ యమా యాక్టివ్‌గా ఉన్నారు. తాజాగా తన ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అయిపోయారు.

Sponsored links

Megastar Chiranjeevi House Full Video..:

Megastar Chiranjeevi House Full Video..  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019