కరోనా వైరస్: వాళ్ళిద్దరూ రికవరీ అయ్యారు..

Mon 30th Mar 2020 04:48 AM
corona virus,covid 19,tom hanks  కరోనా వైరస్: వాళ్ళిద్దరూ రికవరీ అయ్యారు..
corona virus: They recovered కరోనా వైరస్: వాళ్ళిద్దరూ రికవరీ అయ్యారు..
Sponsored links

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. కరోనా సోకిన వారిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ రోజు రోజుకీ పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. రోగులకి వెంటిలేటర్లు కూడా సరిపోవడం లేదు. అయితే రోగులు పెరిగిపోతుంటే రికవరీ అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. తాజాగా హాలీవుడ్ యాక్టర్ టామ్ హ్యాంక్స్, ఆయన సతీమణి కరోనా నుండి రికవరీ అయ్యారు.

టామ్ హ్యాంక్స్ ఆయన భార్యతో కలిసి సినిమా షూటింగ్ కోసమని ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడే వారిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న టామ్ హ్యాంక్స్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా వైద్యబృందం వీరిద్దరికీ వైద్యం చేసి ఈ కరోనా బారినుండి కాపాడారు.  కరోనా నుండి రికవరీ అయ్యాక వీరిద్దరూ అమెరికాకి వెళ్ళిపోయారు.

రికవరీ అయినా కూడా టామ్ హ్యాంక్స్ సోషల్ డిస్టేన్స్ మెయింటైన్ చేస్తానని.. కరోనా పూర్తిగా తగ్గేవరకు ఎవరితో కలవకుండా ఇంటికే పరిమితమవుతానని తెలిపాడు. ఇంకా ఆస్ట్రేలియాలో తనకి వైద్యం చేసిన వైద్యబృందానికి దన్యవాదాలు తెలియజేశాడు. కష్ట కాలంలో తనకోసం ఆలోచించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు.

Sponsored links

corona virus: They recovered:

Tom Hanks recoverd from coronavirus

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019