‘రాక్షసీ’.. మెగా కాంపౌండ్‌ను వదలవేంటి!?

Mon 30th Mar 2020 02:24 PM
andala rakshasi,lavanya,lavanya tripati,mega compound  ‘రాక్షసీ’.. మెగా కాంపౌండ్‌ను వదలవేంటి!?
Andala Rakshasi Didnt Leave Mega Compound ‘రాక్షసీ’.. మెగా కాంపౌండ్‌ను వదలవేంటి!?
Sponsored links

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పేరు ఈ మధ్య వార్తల్లో పెద్ద ఎత్తున నిలుస్తోంది. వీటిలో కొన్ని వివాదాస్పదంగా కాగా.. చాలా వరకు మెగా కాంపౌండ్ విషయమే. ఎందుకంటే.. ఈ రాక్షసి మెగా హీరోల సినిమాల్లో ఏ మాత్రం అవకాశాలు వచ్చాయో లేదో కానీ వార్తలు మాత్రం పుంకాలు పుంకాలుగా వచ్చేస్తున్నాయ్. మొదట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్‌సాబ్’లో నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయ్. అయితే రెండ్రోజుల తర్వాత మళ్లీ అబ్బే ‘వకీల్ సాబ్’ కాదండోయ్ బాబూ.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్-పవన్ కాంబోలో వస్తున్న సినిమాలో లావణ్యను తీసుకున్నారని వార్తలూ వినిపించాయి.

అయితే.. ఈ రెండు పుకార్లు పుట్టిన అతి తక్కువ సమయంలో మరో రూమర్ వెలుగు చూసింది. పైన రెండు సినిమాలు కాదని.. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్న సినిమాలో లావణ్య నటిస్తున్నట్లు పుకార్లు వచ్చాయ్. అంతేకాదు ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి.. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. ఆ ఎపిసోడ్‌లో మరో కథానాయికగా త్రిపాఠిని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయ్.

అంటే.. మొత్తమ్మీద మెగా హీరోలతోనే పవన్‌తో రెండు సినిమాల్లో.. వరుణ్‌తో ఒక్క సినిమాలో ఈ బ్యూటీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజానిజాలున్నాయనేది తెలియట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అందాల రాక్షసికి సంబంధించిన అన్ని పుకార్లు మెగా కంపౌండ్ చుట్టూనే తిరుగుతున్నాయ్.. ఒకటి పోతే ఒకటి వార్తలు వచ్చేస్తున్నాయి. మరి ఈ రాక్షసి మెగా కాంపౌండ్‌ను వదిలేసే ఆలోచన ఉందా..? లేదా ఇలా ఇంకా ఇంకా పుకార్లు వచ్చిందాకా రియాక్ట్ అవ్వకుండానే ఈ వార్తలను సైతం ఆమె తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుంది.

Sponsored links

Andala Rakshasi Didnt Leave Mega Compound:

Andala Rakshasi Didnt Leave Mega Compound  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019