అదిరిపోయే టైటిల్, కథ సిద్ధం చేసిన అనిల్!?

Sun 29th Mar 2020 10:50 PM
anil ravipudi,story and tittle,nandamuri balakrishna,mokshagna  అదిరిపోయే టైటిల్, కథ సిద్ధం చేసిన అనిల్!?
Anil Ravipudi Makes Story and Tittle For..! అదిరిపోయే టైటిల్, కథ సిద్ధం చేసిన అనిల్!?
Sponsored links

తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతూ సూపర్ హిట్ దర్శకుడిగా అనీల్ రావిపూడి పేరుగాంచిన సంగతి తెలిసిందే. జూనియర్ నుంచి సీనియర్, స్టార్ హీరోలతో కూడా సినిమా తీయడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఈయన కోసం హీరోలు క్యూ కడుతున్నారు. అయితే.. తాజాగా ఓ షో వేదికగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. అదేమిటంటే.. తాను బాలయ్యతో.. మోక్షజ్ఞతో సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పేశాడు. అంతేకాదు అసలు ఆయన ఎందుకు సినిమా చేయాలనుకుంటున్నాడో కూడా నిశితంగా వివరించాడు. తాజా సమాచారం మేరకు బాలయ్య, మోక్షజ్ఞ విషయంలో అనీల్ రావిపూడి మరో అడుగు ముందుకేశాడని తెలుస్తోంది.

ఇప్పటికే ‘ఎఫ్2’ సినిమా సీక్వెల్‌కి ‘ఎఫ్3’ స్క్రిప్ట్ రెడీ చేసేసిన అనిల్.. కరోనా నేపథ్యంలో ఇంటిపాటునే ఉన్న ఆయన బాలయ్య కోసం అదిరిపోయే కథ, టైటిల్ ఫిక్స్ చేశాడనిసోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాకు ‘రామారావు’ అనే అదిరిపోయే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేశాడట. అంతేకాదు కథ కూడా దాదాపు పూర్తయిపోయిందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే బాలయ్యను కలిసి స్టోరీ లైన్ వినిపించాలని అనిల్ భావిస్తున్నాడట. 

కాగా.. ఇప్పటికే తాను మోక్షజ్ఞతో సినిమా చేయాలని ఉందని.. అవసరమైతే బాలయ్య-మోక్షజ్ఞతో కలిసి మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ఓ షో వేదికగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. మరి ఫైనల్‌గా పరిస్థితి ఎలా ఉంటుందో..? అసలు బాలయ్య చాన్స్ ఇస్తాడా..? లేకుంటే మోక్షజ్ఞను రెడీ చేసి అనిల్‌కు అప్పగిస్తాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

Sponsored links

Anil Ravipudi Makes Story and Tittle For..!:

Anil Ravipudi Makes Story and Tittle For..!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019