తప్పు విశాల్ వైపే ఉందా..?

Mon 30th Mar 2020 11:22 AM
vishal,detective director mysskin,creative differences,budget problems  తప్పు విశాల్ వైపే ఉందా..?
News about detective 2 creative differences తప్పు విశాల్ వైపే ఉందా..?
Sponsored links

డిటెక్టివ్ 2 కథతో దర్శకుడు మిస్కిన్.. విశాల్ దగ్గరకి వచిన్నప్పుడే... ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవుతుంది. వేరే నిర్మాణ సంస్థలో ఈ డిటెక్టీవ్ 2 ని తెరకెక్కిద్దాం విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ వద్దని దర్శకుడు మిస్కిన్ చెప్పినప్పటికీ.. విశాల్ వినకుండా డిటెక్టివ్ 2 ని తన ఓన్ ప్రొడక్షన్ లోనే మొదలు పెట్టి.... మధ్యలో బడ్జెట్ పెట్టలేక దర్శకుడు మిస్కిన్ మీద ఆరోపణలు చేసాడని కోలీవుడ్ మీడియా కాదు.. మిస్కిన్ మీడియా ముఖంగా విశాల్ ని కడిగి ఆరేసాడు. బడ్జెట్ నీ వల్ల కాదని చెప్పినా విశాల్ వినలేదని స్వయంగా తానే సినిమాని నిర్మిస్తామని బయలుదేరాడని కానీ బడ్జెట్ పెట్టమంటే చేతులెత్తేశాడని అందుకే ఈ సినిమా నుండి తప్పుకున్నా అంటే.. విశాల్ మాత్రం మిస్కిన్ తనని భారీ పారితోషకం డిమాండ్ చేసాడని.. అలాగే మితిమీరిన బడ్జెట్ పెట్టించాడని.. అలాంటి వారితో పని చెయ్యడం కష్టమన్నాడు. ఇక డిటెక్టీవ్ 2 ని ఆఫీషియల్ గా తానే డైరెక్ట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసాడు.

అయితే తాజాగా విశాల్ ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే త్వరలోనే విశాల్ హీరోగా అరమానంబి, ఇరుముగన్ చిత్రాలని డైరెక్ట్ చేసిన ఆనంద్ శంకర్ ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. అయితే ఆ సినిమాని విశాల్ హీరోగానే తన నిర్మాణ సంస్థలోనే తెరకెక్కిస్తానని ఆనంద్ కి చెప్పాడట. అయితే తాజాగా విశాల్ ఆర్ధిక పరమైన ఇబ్బందులతో ఆ సినిమా నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గినట్లుగా వార్తలొస్తున్నాయి. దాంతో ఆనంద్ సెవెంత్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై శింబు హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాలని నిర్ణయంలో ఉన్నాడట. మరి నిజంగానే మిస్కిన్ అన్నట్టుగా విశాల్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడా? తప్పు విశాల్ వైపే ఉందా.. అనేదే పెద్ద ప్రశ్న.

Sponsored links

News about detective 2 creative differences:

detective director mysskin vs Hero Vishal 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019