రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో ఎన్నో ప్రశ్నలు..

Many questions raised from Ramcharan first look

Sat 28th Mar 2020 12:21 PM
rrr,ntr,ramcharan,rajamouli,ramaraju  రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో ఎన్నో ప్రశ్నలు..
Many questions raised from Ramcharan first look రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో ఎన్నో ప్రశ్నలు..
Advertisement

ఎప్పటి నుండో మనల్ని ఊరిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లోని రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ రామరాజుకి ఇచ్చిన గిఫ్ట్ గా వచ్చిన ఈ వీడియో అందరికీ తెగ నచ్చేసింది. ఎన్టీఆర్ వాయిస్ లోని గాంభీర్యం, రాజమౌళి చూపించిన విజువల్స్ మనల్ని కట్టిపడేసాయి. విజువల్ గా రామరాజు మనకు కనిపిస్తుంటే బ్యాగ్రౌండ్ వాయిస్ ఓవర్ లో తెలంగాణ మాండలికంలో ఎన్టీఆర్ గొంతు కొమరంభీమ్ ని గుర్తు చేసింది.

అయితే అంతా బాగానే ఉందిగానీ ఈ ఫస్ట్ లుక్ ద్వారా ఎన్నో ప్రశ్నల్ని వదిలాడు రాజమౌళి. సాధారణంగా మనకు తెలిసిన సీతారామరాజు లుక్ కి రాజమౌళి చూపించిన రామ్ చరణ్ లుక్ కి చాలా తేడా ఉంది. బాణం, తుపాకీ ఉన్నప్పటికీ పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడని ప్రశ్నార్థకంగా మారింది. ఇక మరో విషయం సీతారామరాజు కొమరంభీమ్ కి అన్న ఎలా అయ్యాడు అన్నది అర్థం కాకుండా ఉంది

అయితే రాజమౌళి ఈ కథ కల్పితం అని ముందే చెప్పాడు. 1920 ప్రాంతంలో సీతారామరాజు, కొమరంభీమ్ ఇద్దరూ వారి ఇళ్లనుండి పారిపోయారట. ఆ టైమ్ లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ పాయింట్ నే బేస్ చేసుకుని రాజమౌళి ఈ కథ రాసుకున్నాడట. అందుకే సినిమా రిలీజ్ అయితే అయితే గానీ ఇలాంటి ప్రశ్నలకి సమాధానం దొరకడం కష్టం.

Many questions raised from Ramcharan first look:

Many questions raised from Ram Charan first look


Loading..
Loading..
Loading..
advertisement