కరోనా కారణంగా చిన్నతనం గుర్తుకు వస్తుంది.. కాజల్

Sat 28th Mar 2020 11:50 AM
kajal,ramayana,mahabharata,indian2,acharya,childhood  కరోనా కారణంగా చిన్నతనం గుర్తుకు వస్తుంది.. కాజల్
Lockdown reminds childhood..Kajal కరోనా కారణంగా చిన్నతనం గుర్తుకు వస్తుంది.. కాజల్
Sponsored links

కరోనా కారణంగా భారతదేశం అంతటా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ నడుస్తున్నన్ని రోజులు జనాలు ఎవ్వరూ ఇళ్ళలోకి రావొద్దని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. తెలంగాణలో అయితే జనాలు వినకపోతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు కూడా ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇళ్లకే పరిమితమైన వారందరూ తమ తోచిన పనిచేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ టైమ్ ని బాగా వాడుకుంటుందట. సినిమా షూటింగులు, టీవీ షూటింగులు అన్నీ ఆగిపోవడంతో దూరదర్శన్ లో రామాయణ, మహాభారత సీరియళ్ళని కేంద్రప్రభుత్వం ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ఈ సీరియల్ ని చూస్తూ కాలం గడుపుతుందట. చిన్నప్పుడెప్పుడో చూసిన సీరియళ్ళని ఇలా మళ్ళీ ఇంట్లో అందరితో కలిసి చూస్తుండడంతో మళ్ళీ చిన్నతనానికి వెళ్ళినట్లు ఉందట.

ఈ విషయాన్ని సొషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది కాజల్. ప్రస్తుతం కాజల్ చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. కమల్ హాసన్  ఇండియన్ ౨, మెగాస్టార్ ఆచార్య, అలాగే ఇంగ్లీష్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న మోసగాళ్ళు చిత్రంలోనూ నటిస్తుంది.

Sponsored links

Lockdown reminds childhood..Kajal:

Lockdown reminds childhood..says kajal

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019