చెర్రీ పేరుతో ఫేక్ ప్రకటన.. మెగా ఫ్యాన్స్ షాక్!

Sat 28th Mar 2020 06:10 PM
mega fans,shock,fake announcement,ram charan,cherry birth day  చెర్రీ పేరుతో ఫేక్ ప్రకటన.. మెగా ఫ్యాన్స్ షాక్!
Mega Fans Shock Over Fake Announcement name Of Ramcharan! చెర్రీ పేరుతో ఫేక్ ప్రకటన.. మెగా ఫ్యాన్స్ షాక్!
Sponsored links

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి-27. ప్రతి ఏడాది మెగాభిమానులు ఎంతో ఆనందంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. భారీ ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే.. కరోనా నేపథ్యంలో.. మరీ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు ఇదివరకే చెర్రీ అధికారికంగా ఓ ప్రకటన రూపంలో నిశితంగా వివరించాడు. అయితే.. పుట్టిన రోజు సందర్భంగా చెర్రీకి ఫ్యాన్స్ ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను గురువారం సాయంత్రం మధుర ఆడియో రిలీజ్ చేసింది. దీన్నే అభిమానులు చెర్రీకి గిఫ్ట్‌గా అందించారు. 

అయితే.. మెగాభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్న తరుణంలో చెర్రీ పేరుతో ఓ ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన వార్తతో మెగాభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. యూవీ క్రియేషన్స్ పేరిట క్రియేట్ చేసిన ఓ అకౌంట్‌లో ‘రామ్ చరణ్ తన తర్వాతి సినిమా డైరెక్టర్ సుజిత్‌తో చేయబోతున్నాడు’ అనే ట్వీట్ వచ్చింది. దీంతో మెగాభిమానులు ఒకింత ఆశ్చర్యపోయారు.. మరికొందరైతే బర్త్ డే సర్‌ఫ్రైజ్ అని హ్యాపీగా ఫీలయ్యారు. ‘సాహో’ సినిమా చూశాక కూడా ఆయనకు చెర్రీ ఎలా అవకాశం ఇచ్చాడబ్బా..? అని మెగాభిమానులు ఆలోచనలో పడ్డారు. తీరా చూస్తే.. అది ఫేక్ అకౌంట్ తేలడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారట. అంటే సుజిత్‌ సినిమా అంటే మెగాభిమానులు అస్సలు ఒప్పుకోవట్లేదన్న మాట. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న చెర్రీ కోసం ఎంతో మంది డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మొదలుకుని సుకుమార్ ఇలా చాలా మందే దర్శకులు ఆయన కోసం వెయిటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఫైనల్‌గా ఆయన ఎవరికి చాన్స్ ఇస్తారో ఏంటో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.

Sponsored links

Mega Fans Shock Over Fake Announcement name Of Ramcharan!:

Mega Fans Shock Over Fake Announcement name Of Ramcharan!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019