డ్యామిట్.. ఈ డైరక్టర్ కథ మళ్లీ మొదటికొచ్చింది!?

Sat 28th Mar 2020 06:19 PM
rx-100,director ajay bhupathi,sharwanand,naga chaitanya,raviteja  డ్యామిట్.. ఈ డైరక్టర్ కథ మళ్లీ మొదటికొచ్చింది!?
News About RX-100 Director Ajay Bhupathi డ్యామిట్.. ఈ డైరక్టర్ కథ మళ్లీ మొదటికొచ్చింది!?
Sponsored links

‘ఆర్ఎక్స్ 100’ లాంటి బుల్లెట్ సినిమాను గురి తప్పకుండా షూట్ చేసి.. టాలీవుడ్‌లో సింగిల్ సినిమాతో తన సత్తా చాటి చూపించిన దర్శకుడు అజయ్ భూపతి. ఫస్ట్ సినిమాతో రికార్డ్ సృష్టించిన అజయ్.. తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారు..? ఏ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నారు..? అసలు ఆయన సినిమాలో హీరో ఎవరు..? హీరోయిన్ ఎవరు..? ఈ సినిమాకు ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..? అనేవి గత కొన్ని రోజులుగా వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నలు. అయితే అత్యుత్సాహంతో కొన్ని వెబ్‌సైట్లు ఏవేవో రాసేస్తున్నాయి. 

మాస్ మహారాజ్ రిజెక్ట్ చేయడం.. ఆ తర్వాత నాగ చైతన్య కోసం వెయిటింగ్.. శర్వానంద్ ఇలా చాలా మంది దగ్గరికెళ్లి కథ వినిపించడం వెనక్కి తిరగడమే సరిపోయింది. అప్పట్లో ఇలా వరుస కథనాలు రావడంతో స్పందించి అవన్నీ పుకార్లేనని చెప్పిన అజయ్.. ఆ తర్వాత మిన్నకుండిపోయాడు. తాజా పరిణామాలను బట్టి చూస్తే ‘డ్యామిట్.. ఈ డైరక్టర్ కథ మళ్లీ మొదటికొచ్చింది!?’ అనే పరిస్థితులు వచ్చాయట.

శర్వానందే ఫైనల్ అనుకున్నప్పటికీ ఈ మధ్య ఆయన సినిమాలన్నీ ఆశించినంతగా ఆడకపోవడంతో ఇలాంటి తరుణంలో ప్రయోగాలు చేసి ప్రయోజనం లేదని.. సారీ అజయ్ అని సింపుల్‌గా చెప్పేశాడట. మరోవైపు అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు గట్టిగానే దర్శకుడ్ని దొబ్బుతున్నారట. ఏం చేద్దాం..? వాట్ నెక్స్ట్ అని ఆలోచించడానికే సగం సమయం సరిపోతోందట. మొత్తానికి చూస్తే ఈ డైరెక్టర్‌ గారి కథ మళ్లీ మొదటి కొచ్చినట్లుంది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అజయ్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవ్వాల్సిందే.

Sponsored links

News About RX-100 Director Ajay Bhupathi:

News About RX-100 Director Ajay Bhupathi  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019