ప్లీజ్ ప్లీజ్ వాళ్లకు సాయం చేయండి : యాంకర్ రష్మీ

Fri 27th Mar 2020 07:21 PM
please help,corona lock down,beggers,reshmi,anchor reshmi  ప్లీజ్ ప్లీజ్ వాళ్లకు సాయం చేయండి : యాంకర్ రష్మీ
Please Help Those.. Over Corona Lock Down.. Reshmi ప్లీజ్ ప్లీజ్ వాళ్లకు సాయం చేయండి : యాంకర్ రష్మీ
Sponsored links

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇళ్లలో నుంచి జనాలు బయటికి రావాలన్నా.. ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు పోవాలన్నా నానా తంటాలు పడుతున్నారు. తెగించి వెళితే పోలీసులు ఎక్కడ లాఠీలకు బుద్ధి చెబుతారనే ఒక భయం.. మరోవైపు అక్కడ తప్పించుకుని వెళితే ఎక్కడ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందేమోనని జంకుతున్నారు. అయితే.. సాధారణ మనుషుల పరిస్థితి ఇలా ఉంటే.. పూట పూటకు బిక్షమెత్తి బతికే బిచ్చగాళ్ల పరిస్థితేంటి..? వాళ్లు ఎలా బ్రతకాలి..? చెత్త ఏరుకుని మాత్రమే జీవనం సాగించే వారి పరిస్థితేంటి..? ఇలాంటి విషయాలను టాలీవుడ్ యాంకర్ రష్మీ ఓ వీడియో ద్వారా ప్రస్తావించింది.

రేష్మీ సలహా..

అంతేకాదు.. వారికి ఎలా సాయం చేయాలో కూడా రష్మీ ఆ వీడియోలో నిశితంగా వివరించింది. లాక్ డౌన్ సందర్భంగా దుకాణాలన్నీ.. టిఫిన్ సెంటర్స్ కూడా బంద్‌లో ఉన్నాయని తద్వారా పేదలకు ఫుడ్‌ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. కొందరికి చెత్త ఏరుకోవడం తప్ప మరో ఆప్షన్‌ లేదని.. దాని వల్లే వారు బతుకుతున్నారని చెప్పింది. అయితే.. మీరు తినేటప్పుడు ఒక్క చపాతి అయినా వారికి ఇవ్వడం.. లేదా కొంచెం అన్నం పెడితే వారి ఆకలి తీరుతుందని సలహా ఇచ్చింది.

ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్..

‘చపాతి, రైస్‌.. కనీసం బిస్కెట్లయినా సరే వారికి ఇస్తే వారు తింటారని.. కనీసం మీ గేటు వద్దయినా కాస్త ఆహారం పెట్టాలని వారు వచ్చి తీసుకుని తింటారని చెప్పింది. మనం ఇంట్లో మూడు పూటలు తింటున్నామని.. కానీ పేదోళ్లు మాత్రం తిండి తిప్పలతో నానా ఇబ్బందులు పడుతున్నారని ప్లీజ్.. ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ వారికి కాస్త ఆహారం అందిద్దామని వీడియో వేదికగా రష్మీ పిలుపునిచ్చింది. అయితే ఈ సలహాకు కూడా పలువురు నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరి కామెంట్స్‌కు రష్మీకి చిర్రెత్తుకు రావడంతో ఆగ్రహంతో ఊగిపోతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Sponsored links

Please Help Those.. Over Corona Lock Down.. Reshmi:

Please Help Those.. Over Corona Lock Down.. Reshmi

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019