పూరీ బీచ్‌లో తిరుగుడుపై చిరు ఇంట్రెస్టింగ్ ట్వీట్

Fri 27th Mar 2020 07:07 PM
megastar chiranjeevi,tweets,beach,director puri jagannadh,charmi  పూరీ బీచ్‌లో తిరుగుడుపై చిరు ఇంట్రెస్టింగ్ ట్వీట్
Megastar Chiranjeevi Tweets Over Director Puri Jagannadh పూరీ బీచ్‌లో తిరుగుడుపై చిరు ఇంట్రెస్టింగ్ ట్వీట్
Sponsored links

ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు పలువురు నటీనటులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. మరికొందరు మెగాస్టార్‌ను హృదయపూర్వంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో చాలా మందితో మెగాస్టార్ సరదాగా సంభాషించారు. ఈ జాబితాలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఉన్నాడు. అసలు వీరిద్దరి ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు చూద్దాం..

మొదట చిరంజీవికి పూరీ వెల్‌కమ్ చెప్పాడు. ‘సోషల్ మీడియాలోకి స్వాగతం సార్.. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తున్న తరుణంలో సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తోంది’ అని చిరుకు పూరీ ట్వీట్ చేశాడు. ఇందుకు మెగాస్టార్ అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. ‘థాంక్యూ పూరీ.. కరోనా కారణంగా మంచి ఫ్యామిలీ టైమ్ లభిస్తోంది. ముంబై, బ్యాంకాక్ బీచ్‌లను నువ్.. మిస్ అవుతావేమో కానీ.. పవిత్ర, ఆకాశ్ నీతో సమయాన్ని గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు’ అని చిరు రీ ట్వీట్ చేశారు.

ఇందుకు పూరీ మురిసిపోయి.. ఇందుకు ఏమీ సమాధానం చెప్పలేక.. ఏం చెబితే నెటిజన్స్ ట్రోల్ చేస్తారో అని.. ‘లవ్ యూ అన్నయ్యా’ దండం పెట్టినట్లున్న ఎమోజీలను అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీ బీచ్‌ల సంగతి మాకెందుకు తెలియదు సార్.. అని కొందరు... అన్నీ సరే కానీ బాస్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు అని మరికొందరు పూరీపై కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. వామ్మో.. చిరు బీచ్‌ల గురించి మాట్లాడే సరికి పూరీకి మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అందుకే లవ్ యూ అన్నయ్యా అని ట్వీట్స్ మానేశాడని కామెంట్స్ చేస్తున్నారు.

Sponsored links

Megastar Chiranjeevi Tweets Over Director Puri Jagannadh:

Megastar Chiranjeevi Tweets Over Director Puri Jagannadh  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019