కరోనా సోకితే ఎలా ఉంటుందో నటి మాటల్లో..!

Thu 26th Mar 2020 08:07 PM
bollywood actress,shefali shah,covid-19,awareness,lungs  కరోనా సోకితే ఎలా ఉంటుందో నటి మాటల్లో..!
Bollywood Actress Shefali Shah Over Covid-19 awareness! కరోనా సోకితే ఎలా ఉంటుందో నటి మాటల్లో..!
Sponsored links

కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది. ఈ వైరస్ బారీన పడిన జనాలు వేలాది మంది మృత్యువాత పడగా.. మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకకుంటున్నారు. ఇక హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేం. వాళ్లు పడే బాధలు.. కష్టాలు పైనున్న పెరుమాళ్లకే ఎరుక. అసలు క్వారంటైన్‌లో ఉంటే ఎలా ఉంటుంది..? ఏమేం చేయాలి..? అనే అనుభవాలను బాలీవుడ్‌ నటి షెఫాలీ షా నిశితంగా వివరిస్తూ.. అదే విధంగా నెటిజన్లు, క్వారంటైన్‌లో ఉండే వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేసింది. తల చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకున్న షెఫాలీ తను పడుతున్న బాధలు.. అదే విధంగా ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటున్నానే విషయాలను వీడియో రూపంలో చెప్పి దాన్ని.. ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

ఊపిరితిత్తులు కూడా ఇలాగే..

ఇదిగో ముఖం చుట్టూ కవర్ కట్టుకున్నా చూశారు కదా.. ఇలాగే ఊపిరిసలపకుండా ఉంటుందని ఒకింత భావోద్వేగానికి లోనయ్యింది. ఈ వైరస్ బారీన పడితే మన ఊపిరితిత్తులు కూడా ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతుంటాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా శ్వాస అనేది అస్సలు ఆడదని.. బాధతో చెప్పింది. మనం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు కచ్చితంగా నిబంధనలు పాటించకపోతే చాలా డేంజర్ అని.. తద్వారా మనతో పాటు మన ప్రియతములు కూడా శ్వాస తీసుకోలేకపోతారని అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచించింది. వాళ్లకు దూరంగా ఉండటం తప్ప మనకు మరో ఆప్షన్‌ అస్సలు లేనే లేదని చెప్పింది. 

హెచ్చరిక కాదు అంతకు మించి..

‘మనం.. మనతో పాటుగా కుటుంబాలు, కుటుంబ సభ్యులు అందరూ  బాగుండాలంటే కొన్ని రోజుల పాటు ఇలాంటివన్నీ తప్పవు. ఇంట్లోనే ఉండండి.. బయటికి వచ్చినప్పుడు ఆ వైరస్ వేరెవరికైనా సోకితే.. అది మరింత మందికి సోక్ ప్రభావం ఉంది.. అది కాస్త కార్చిచ్చులా మారిపోతుంది.. ఇది హెచ్చరిక కాదని.. అంతకు మించి’ అని వీడియో రూపంలో  నటి షెఫాలీ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ భామ వీడియోపై నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Sponsored links

Bollywood Actress Shefali Shah Over Covid-19 awareness!:

Bollywood Actress Shefali Shah Over Covid-19 awareness!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019