చిరు భీభత్సం సృష్టిస్తున్నాడుగా..!

Thu 26th Mar 2020 08:11 PM
chiranjeevi,mega star,twitter,social media,mega fans  చిరు భీభత్సం సృష్టిస్తున్నాడుగా..!
Mega Star Chiranjeevi Creates Sensation with Tweets చిరు భీభత్సం సృష్టిస్తున్నాడుగా..!
Sponsored links

ఇప్పటివరకు మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటోళ్ళు సినిమాల్తో పాటుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ మెగా హీరోలకు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఫాన్స్ విపరీతంగా ఉన్నారు. మెగా ఫాన్స్ ఈ మెగా హీరోల్లో ఏ ఒక్కరు ట్వీట్ వేసినా వీళ్లు లైక్స్ షేర్స్ తో హోరెత్తిస్తారు. అల్లు అర్జున్ అయితే ఫేస్ బుక్ కింగ్, రామ్ చరణ్ కూడా తాజాగానే సోషల్ మీడియాలోకి వచ్చినా.... భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇక మెగాస్టార్ చిరు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.... ఆయన సినిమాలకు క్రేజ్ గాని ఆయనకి క్రేజ్ గాని ఏమాత్రం తగ్గలేదు. అయితే చిరు నాలుగేళ్ళ క్రితం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకు సోషల్ మీడియాలో కాలు పెట్టలేదు.

కానీ తాజాగా చిరు ఉగాది కానుకగా సోషల్ మీడియాలో అడుగు పెట్టాడు.. మరి చిరు సోషల్ మీడియాలో అడుగు పెడితే మెగా హీరోల కూడా షేక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో చిరు మీదున్న ఫేక్ అకౌంట్స్ కే వేలల్లో లైక్స్ వస్తుంటే, చిరు ఆఫీషియల్ అకౌంట్ లో ట్వీట్ వేస్తె ఆ లైక్స్, షేర్స్, వ్యూస్ భీభత్సంగా ఉండడం ఖాయం. నిన్న ఉగాది కానుకగా చిరు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ పెట్టి.. మీతో ఇలా సోషల్ మీడియాలో మాట్లాడడం ఆనందంగా ఉందని... ఈ సోషల్ మీడియాతో మీకు మరింత దగ్గరవడం సంతోషం అని చెబుతున్నాడు. చిరు ఇలా ట్వీట్ వేశాడో లేదో అలా లైక్స్ తో మెగా ఫాన్స్ హోరెత్తించారు.

Sponsored links

Mega Star Chiranjeevi Creates Sensation with Tweets:

Mega Star Enters social Media on Ugadi Eve

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019